కర్ణాటకలో పార్టీల ఇంచార్జీలుగా తెలంగాణ వారు

MADHU YASHKI, MURALIDHARRAO
MADHU YASHKI, MURALIDHARRAO

బెంగుళూరు: కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు తెలంగాణకు చెందిన ఇద్దరు నాయకులు ఆ పార్టీల ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఇంఛార్జిగా మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్‌, బిజెపి ఇంచార్జిగా మురళీధరరావు వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో వారి పార్టీలను గెలిపించుకునేందుకు వీరిద్దరూ గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా వివిధ పార్టీల నేతలు హంగ్‌ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.