కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న హైదరాబాద్‌ సీపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ రెండో విడత కొనసాగుతుంది. ఇందులో భాగంగా పాతబస్తీలోని పేట్లబర్జులో ఉన్న నగర పోలీసు శిక్షణా కేంద్రంలో హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. క‌రోనా టీకా సుర‌క్షిత‌మ‌ని సీపీ అంజ‌నీ కుమార్ అన్నారు. ఇటీవ‌లే రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌తో పాటు ప‌లువురు క‌రోనా టీకా తీసుకున్న విష‌యం తెలిసిందే.

రాష్ట్రంలో రెండో దశ కరోనా టీకా పంపిణి ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యింది. ఇందులో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు అయిన పోలీసు, మున్సిపల్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బందికి కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు. కరోనా టీకా కోసం సుమారు 2 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.