కరోనా నివారణ చర్యలలో ప్రభుత్వం విఫలం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

uttam kumar reddy
uttam kumar reddy

హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ నేతలతో కలిసి రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కరోనా సహయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందిపడుతున్న పేదలకు రూ. 1500 కు బదులు రూ. 5వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వ విఫలం అయిందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు. రైతులకు సరిపడు గోనే సంచులు, పట్టాలు ఇవ్వకపోవడం వల్లే ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాలు ఆ భాధ్యత తీసుకోలేదు కాబట్టే తాము తీసుకున్నామని తెలిపారు. సోనియాగాంధీ పిలుపు మేరకు వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి సహయం చేస్తున్నట్లు పేర్కోన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే తెలంగాణలోనే కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని అన్నారు. చనిపోయిన వారికి కరోనా టెస్టులు చేయవద్దనడం చూస్తుంటే కరోనా కేసుల సంఖ్యను తగ్గించడానికే అన్న అనుమానాలు వస్తున్నాయని ఉత్తమ్‌ అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/