కరోనా నివారణ చర్యలపై జగన్‌ సమీక్షా సమావేశం

ఎక్కడివారు అక్కడే ఉండండి: జగన్‌

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి: ఏపిలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో కరోనా నివారణ చర్యలపై సిఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జగన్‌ పొరుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలనుద్దేంచి.. ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారు అక్కడే ఉండాలని, కేంద్రం ప్రభుత్వం కేవలం వలస కూలీలకు మాత్రమే అనుమతినిచ్చిందని,ఆ మేరకు వారిని సొంత రాష్ట్రాలకు తీసుకువచ్చి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాలనుండి వచ్చి సరిహద్దుల్లో ఇబ్బందులు పడవద్దని సూచించారు.కరోనా నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండటం క్షేమమని, ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/