కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలి
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ను అన్ని పక్షాల వారు సమర్ధిస్తున్నారని, కాని ప్రభుత్వం అందరిని కలుపుకుని పోవడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని అన్నారు. కరోనా పరీక్షలను మరింత పెంచాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ విధించిన ఈ సమయంలో కాళేశ్వరం టెండర్లు పిలవడం సరికాదని, కేవలం రెండు కంపెనీలే టెండర్లు వేయడం పలు అనుమానాలకు తావిస్తుందని కోదండరామ్ అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/