కరోనా నియంత్రణను గాలికొదిలేయకండి
ఏపి టిడిపి నేత వర్లరామయ్య

అమరావతి: ఏపిలో కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా మూతపడిన వైన్ షాపులు తెరుచుకోవడంతో జనాలు భారీ ఎత్తున వైన్ షాపుల ముందు నిలుచున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్న ఈ సమయంలో మద్యం దుకాణాలు తెరవడంపై ఏపి టిడిపి నేత వర్లరామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు. కరోనా లాక్డౌన్తో సతమతమవుతున్న పోలీసులకు, మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మందు షాపుల దగ్గర, మందు బాబులను కంట్రోల్ చెయ్యడం పెద్ద పనిగా మారింది. గ్రీన్ జోన్స్లో తాగిన మందుబాబులు రెడ్ జోన్లో ప్రవేశించి ఆగడాలు చెయ్యకుండా నిరోధించడం వారికి మరో పని అయింది. ఈ సమయంలో కరోనా నియంత్రణను గాలికొదిలేయకండి సార్ అంటూ రామయ్య ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/