కరోనా అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

puvvada ajay kumar
puvvada ajay kumar

కొత్తగూడెం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ అంబులెన్సులు, కొవిడ్ సంచార పరీక్ష వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి విజ్ఞప్తి మేరకు గత సంవత్సరం హడ్కో సంస్థకు లేఖ రాశారు. స్పందించిన ఆయా సంస్థ రూ.60.69 లక్షల విలువగల అడ్వాన్స్డ్ అంబులెన్స్ లు మంజూరు చేసింది.

అనివార్య కారణాల వల్ల నేడు ఎదుర్కొంటున్న కొవిడ్ కు ఆయా అంబులెన్స్ లను వినియోగించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(బ్య్ట్ఞ్నీ) సమకూర్చిన పూర్తి అధునాతన 2 అంబులెన్సులు జిల్లా దవాఖానకి (1), భద్రాచలం ఏరియా దవాఖానకు(1) అంబులెన్స్ , రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంబులెన్స్(1) ఆర్టీసీ నుంచి సంచార కోవిడ్ టెస్ట్ వాహనం(1) లను రవాణా మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఐసోలాషన్ వార్డ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వెంటిలేటర్ లను ప్రారంభించారు. ఆయా పరిస్థితులను పరిశీలించారు. కరోనా పాజిటివ్ వస్తే ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా చికిత్స ను అందజేస్తామని పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/