కరోనాపై పోరుకు భారత మహిళల హాకీ జట్టు విరాళం
ఢిల్లీలోని ఓ స్వచ్చంద సంస్థకు విరాళం అందజేత

న్యూఢిల్లీ: కరోనా పై పోరుకు భారత మహిళల హాకీ జట్టు సహయం అందించింది. ఢిల్లీలోని ఓ స్వచ్చంద సంస్థకు రూ. 20 లక్షలు అందించింది. ఫిట్నెస్ ఛాలెంజ్‌తో 18రోజులపాటు సేకరించిన 20 లక్షలను, కరోనా భాధితులకు సహయపడుతున్న ఢిల్లీకి చెందిన ఎన్జీవో సంస్థ ఉదయ్ ఫౌండేషన్‌కు అందించింది. ఈ విరాళాలను సేకరించడానికి భారత హాకీ ప్లేయర్లు రోజుకు ఒకరు సోషల్ మీడియాలో ఒక ఫిట్నెస్ ఛాలెంజ్‌ను విసిరి, అందుకు పది మందిని నామినేట్ చేసేవారు. చాలెంజ్‌ను స్వీకరించిన వారు ఒక్కోక్కరు వంద రూపాయల చొప్పున విరాళంగా ఇచ్చేవారు. ఈ విధంగా 18 రోజులపాటు సేకరించిన విరాళాలను స్వచ్చంద సంస్థకు అందజేశారు. తాము చేసిన ఈ పనికి అద్బుతమైన మద్దతు లభించిందని హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ పేర్కోంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/