కరోనాతో భారత సంతతి వైద్యుడు మృతి

corona virus
corona virus

కువైట్‌: కరోనా మహమ్మారితో కువైట్‌లో ఓ భార‌త సంత‌తి వైద్యుడు మ‌ర‌ణించారు. వాసుదేవ రావు(54) అనే భార‌తీయ వైద్యుడు దుబాయిలోని జ‌బేర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లొదిలారు. 15 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న వాసుదేవ రావు.. కువైట్ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కువైట్ ఆయిల్ కంపెనీలో ఎండోడాంటిస్ట్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. కువైట్‌లోని ఇండియ‌న్ డెంటిస్ట్ అలియ‌న్స్(ఐడీఏ) స‌భ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయ‌న మ‌ర‌ణం తీర‌ని లోటు అని ఐడీఏ పేర్కొంది. కాగా, భార‌త్ నుంచి కువైట్‌లోకరోనా వల్ల చ‌నిపోయిన రెండో మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్ వాసుదేవ రావు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/