కరెన్సీ కష్టాలకు చెక్‌: ఈటల

eetela
eetela

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు వచ్చినవి వాస్తవమేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శాసనమండలిలో ప్రశోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు 73 వేల కోట్ల 642 కోట్లు కరెన్సీ నిల్వలు ఉండేవని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో కరెన్సీ కష్టాలపై ఇప్పటికీ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ పలుమార్లు కలిశామన్నారు. ప్రస్తుత సమయంలో బ్యాంకుల్లో కరెన్సీ కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటల వివరించారు.