కరువు నివారణకు భారీగా ఇఫాడ్ నిధులు

IMG_20170907_200035

కరువు నివారణకు భారీగా ఇఫాడ్ నిధులు..

ఢిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం

అమరావతి, సెప్టెంబర్ 7: రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పటు ప్రకాశం జిల్లాలో కరువు నివారణ చర్యల కోసం 75 మిలియన్ డాలర్ల (సుమారు రూ.500 కోట్లు) సహాయం అందించడానికి అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి సంస్థ (ఇఫాడ్) రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రోజు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం సమక్షం లో రాష్ట్ర ప్రభుత్వం – అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి సంస్థ (ఇఫాడ్) తో కుదిరిన ఈ ఒప్పందం లో రాబోయే ఐదేళ్లలో 5 జిల్లాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తారు. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 1,65,000 కుటుంబాలకు ఆదాయ వనరులు పెరిగేలా తీసుకునే వివిధ చర్యలకు ఇఫాడ్ నిధులను వినియోగించనున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ఇఫాడ్ కంట్రీ ప్రోగ్రాం ఆఫీసర్ రష ఒమర్, కేంద్ర ఆర్ధిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే ఒప్పందం పై సంతకాలు చేశారు.