కరుణ ఆరోగ్యం నిలకడగానే ఉంది

palani swami
palani swami

చెన్నై: కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిఎంకే అధినేత ఎం. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని తమిళనాడు సియం పళనిస్వామి చెప్పారు. సోమవారం ఉదయం కరుణానిధి కుటుంబసభ్యులను కలిసిన ఆయన కరుణానిధి ఆరోగ్యంపై ఆరా తీశారు. నిన్న రాత్రి కరుణ ఆరోగ్యం విషమించిదన్న వార్త బయటకు రావడంతో డిఎంకే కార్యకర్తలంతా కన్నీరుమున్నీరవుతూ ఆస్పత్రికి పరుగులు తీశారు. గుండెలు బాదుకుంటూ రోదించారు. దీంతో కరుణ ఆరోగ్యంపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.