కరీబియన్‌ లీగ్‌ జట్టు 100 డాలర్లకే: మాల్యా

Vijay Mallya
న్యూఢిల్లీ : వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సిపిఎల్‌)లో బార్బడోస్‌ ట్రిడెంట్స్‌ జట్టును కేవలం వంద డాలర్లకే కొన్నానని విజయ్ మాల్యా వెల్లడించాడు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా సిపిఎల్‌ జట్టు విషయంలో నడిపిన లావాదేవీ లపై ఆరాలు తీస్తున్న నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది.కాగా మాల్యానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు.సిపిఎల్‌ జట్టు బార్బడోస్‌ను సొంతం చేసుకోవడంలో పెద్ద డ్రామా జరిగిందని,అయితే జట్టును చేజిక్కించుకోవడానికి నేను పెట్టిన ఖర్చు 100 డాలర్లు మాత్రమే నని, అయితే టోర్నీలో పాల్గొనడానికి చాలా ఖర్చవు తుందని పేర్కొన్నాడు. ఐపిఎల్‌లో లాగా ఇందులో ప్రాంచైజీలకు ఆదాయాన్ని పంచడం ఉండదని, టికెట్లు, స్పాన్సన్‌షిప్‌ ద్వారానే ఆదాయం సమకూర్చు కోవా లని, మొత్తంగా నిర్వహణ ఖర్చు రెండు మిలియన్‌ డాలర్ల దాకా అవుతుందని, ఇందుకోసం బార్బడోస్‌ ప్రభుత్వం రాయితీలిచ్చిందని, లీగ్‌ తీరుతెన్నులన్నీ పరిశీలించాకే ఆ ప్రభుత్వాన్ని సాయమడిగా మన్నాడు.