కరీనా పార్టీలో.. కూతురే అట్రాక్షన్‌…

Kareena Kapoor Birthday party
Kareena Kapoor in his BirthDay Party. with daughter

కరీనా పార్టీలో.. కూతురే అట్రాక్షన్‌…

బాలీవడ్‌ులో బెబో బర్త్‌డేని ఇపుడు విశేషంగా చెప్పుకుంటున్నారు… డిసెంబర్‌లో అమ్మ కానున్న కరీనాకపూర్‌.. సెప్టెంబర్‌ 21న తన బర్త్‌డే వేడుకలను జరపుకున్నారు.. 38లోకి ఎంట్రీ ఇస్తున్న బెబో., సన్నిహితులు, బంధువులు , స్నేహితులతో ఈసెలబ్రేషన్‌ చేరుకుంది.
అసలే గర్భవతిగా ఉన్న భార్య బర్త్‌డే..మరి భర్త సైఫ్‌ ఆలీఖాన్‌ రాకుండా ఉంటారా?.. ఇటు కరీనా అక్క కరిష్మా కపూర్‌, బ్రదర్‌ రణ్‌బీర్‌కపూర్‌లు కూడ ఈ పార్టీలో కన్పించారు.. వీరేకాకుండా చాలామంది కపూర్‌లు.. ఖాన్‌లు సందడి చేశారు.. ఇలాచాలా మంది సెలబ్రిటీలు అక్కడ కన్పించినా.. అందరికంటే ఎక్కువ ఫోకస అయ్యింది మాత్రం ఒకే ఒక్క కుర్రభామ.. ఆవిడే సైఫ్‌ ఆలీఖాన్‌ మొదటి భార్య కూతురు సారా ఆలీఖాన్‌… ఇప్పటికే సోషల్‌ మీడియాలో బాగా ఫేమస్‌ అయిన ఈ భామ.. కరీనా ఫంక్షన్‌ మొత్తంలో సెంట్రాఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యింది.. కాగా ఈభామ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్నారని మాటలు విన్పిస్తున్నాయి… కరణ్‌జోహర్‌ తెరకెక్కిస్తున్న స్టూడెంట్‌ ఆఫ్‌ది ఇయర్‌-2లో టైగర్‌ ష్రాఫ్‌కి జంటగా సారా ఎంట్రీ ఇవ్వనుందట.. మరి ఇలాంటి తరుణంలో పిన్ని ఫంక్షన్‌లో అందాలు ఆరేస్తూ ఈ భామ , బాగా ఫోకస్‌ అయ్యింది..