కరణం ధోరణిపై చంద్రబాబు ఫైర్‌

CHANDRA BABU
CHANDRA BABU

 

అమరావతి: ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ పోరుపై పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు
ఆందోళన చెందుతున్నారు. అద్దంకిలో టిడిపి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు
అధ్యక్షత వహించారు. నియోజక వర్గంలో పార్టీ నేతల మధ్య వర్గ విభేదాలపై చర్చ జరిగింది. గత కొన్ని
రోజులుగా కరణం బలరాం,గొట్టిపాటి రవికుమార్‌ వర్గీయులు పరస్పరం దాడులకు దిగుతున్న విషయం
తెలిసిందే. ఈ దాడులను ఇంతటితో పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆదేశించారు. కరణం మాట చెల్లదని, రవి కుమార్‌
నిర్ణయాలు చెల్లుబాటుఅవుతాయని చంద్రబాబు చెప్పడంతో కరణం వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు
సమాచారం.