కబ్జాల ముప్పు నగరాలకు ముంపు

durgam fff
Durgam View in Hyderabad

కబ్జాల ముప్పు నగరాలకు ముంపు

రెండువేల పద్నాలుగులో ప్రపంచవ్యాప్తంగా 28 మెగా సిటీలు ఏర్పడ్డాయి. 453 మిలియన్‌ ప్రజలకు ఇవి ఆశ్రయం కల్పించాయి. అత్యధికంగా 38 మిలియన్‌ జనాభా ఉన్న జపాన్‌లోని టోక్యోనగరం తర్వాత శాంఘై, ఢిల్లీ నగరాలు అత్య ధికంగా జనాభా కలిగిన నగరాలుగా చోటు చేసుకున్నాయి.

2030 నాటికి ప్రపంచం మొత్తం మీద 41 మెగాసిటీలు ఆవిర్భ విస్తాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక వివరిస్తోంది. వీటితోపాటు స్మార్ట్‌సిటీలు, శాటిలైట్‌నగరాలు ఇవన్నీ రూపకల్పన జరుగుతాయి. ఇంతజనాభా కలిగిన నగరాలు ఏర్పడినప్పటికీ ఆధునిక సౌకర్యాలు ఎంతబాగా విస్తరించినప్పటికీ డ్రైనేజీ,మంచినీటి సరఫరా తదితర మౌలికసౌకర్యాలు సజావ్ఞగా లేకపోతే ఆ నగరాలకు తీరని ముప్పే వాటిల్లుతుంది.ముఖ్యంగా 2011లో శీతోష్ణస్థితి మార్పుతో ప్రమాద కరంగా తయారైన పది దేశాల్లో ఆరు దేశాలు ఆసియా పసిఫిక్‌ పరిధిలోనే ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభం, శీతోష్ణస్థితి మార్పు, జీవన విధానంపై ప్రభావం చూపిస్తున్నాయి. కోస్తాతీర ప్రాంతాల్లో తుపాన్‌లు,టైఫూన్‌లు ఎక్కువగా సంభవించి ప్రజల జీవితాలపట్ల శాపంగా మారాయని నివేదిక వెల్లడిస్తోంది.

2070 నాటికి కోస్తాతీరం ఉప్పెనలా విరుచుకుపడే ప్రమాదం ఉందని ఈనగరాల్లో చాలా నగరాలు వరదముప్పును ఎదుర్కోను న్నాయని నివేదిక భవిష్యత్‌ ప్రమాదాన్ని సూచించింది. 2050 నాటికే సముద్ర నీటిమట్టాలు విపరీతంగాపెరిగి దాదాపు 40 మిలియన్‌ భారతీయులు ప్రమాదంలోపడే ముప్పుకాలం పొంచి ఉందని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచం మొత్తం మీద ప్రమాదా న్ని ఎదుర్కోనున్న పది దేశాల్లో ఏడు దేశాలు ఆసియాపసిఫిక్‌ ప్రాం తంలోనే ఉన్నాయి.ఈ దేశాల మొదటిస్థానంలో భారతదేశం ఉంది. భారత దేశంలోని 40 మిలియన్‌ ప్రజలందరికీ ఇది ఒక హెచ్చ రిక. ఇదే విధంగా బంగ్లాదేశ్‌లోని 18 మిలియన్‌ ప్రజలు చైనాలో 2.0మిలియన్‌ ప్రజలు, ఫిలిప్పైన్‌లోని 15 మిలియన్‌ ప్రజలు ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనే ప్రమాదం సంభవిస్తోందని నివేదిక వెల్లడిం చింది.ఆసియాలో నగరీకరణ, సామాజిక ఆర్థికస్థాయి పరిణామాలు శీతోష్ణస్థితిలో ఊహించని మార్పులకు కారణం అవ్ఞతున్నాయి. కోస్తాతీర ప్రాంతంలో నగరాల విస్తరణ జోరుగా సాగుతోంది.

చైనా, భారత్‌, థాయిలాండ్‌ వంటి దేశాల్లోని అర్బన్‌ ప్రాంతాలు విస్తరిస్తు న్నాయి. భారత్‌లో ముంబాయి, కోల్‌కతా, గుర్గాంవ్‌, చైనాలోని శాంఘై, బంగ్లాదేశ్‌లో ఢాకా,మయన్మార్‌లో యాంగా, థాయిలాండ్‌ లో బాంకాంగ్‌, వియత్నాంలో హాచ్‌నీచ్‌, ఐఫాంగ్‌, తదితర నగ రాలు అత్యధిక జనాభాతో విస్తరిస్తున్నాయి. ఈ విస్తరణ మైళ్లపొడ వ్ఞనా జరుగుతున్నప్పటికీ భారతదేశంలోని పూనె, కలకత్తా, తది తర మహానగరాల విస్తరణలో అంగుళం భూమి కూడా మిగల కుండా ఎక్కడపడితే అక్కడ కాంక్రీట్‌భవనాల నిర్మాణాలు కొనసాగు తున్నాయి. వాగులు, వంకలు, నదీగర్భాలు, అన్నా తేడా లేకుండా చోటు దొరకడమే మహాభాగ్యంగా నిర్మాణాలు ఒక ప్రణాళిక అంటూ లేకుండా నిర్మించడంతో ఏ వైపరీత్యం జరిగినా నగరాలకే ప్రమాదా లు అకస్మాత్తుగా ముంచుకువస్తున్నాయి. ప్రణాళికబద్ధంగా జరిగిన అభివృద్ధి కన్నా అక్రమనిర్మాణాలే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నం దున చినుకుపడితే చాలు నగరాలన్నీ జలప్రళయాన్ని ఆహ్వానిస్తు న్నాయి. గత ఏడాది చెన్నైలో నగరంలో సంభవించిన జలప్రళయం గత వందేళ్లలో ఎప్పుడూ అక్కడజరగలేదు. పల్లపుప్రాంతాలు మునిగి పోవడం సహజమేకాని చెన్నైలో జరిగిన ప్రమాదంలో అధికార పరంగా నిర్లక్ష్యం ఎదురవడంతో నగర పొలిమేరల్లో ఉన్న చంబరాం బక్కమ్‌ రిజర్వాయర్‌లో వరద నీరు కట్టలు గేట్లు తెంచు కొని ఒక్క సారిగా నగరాన్ని ముంచివేసిన జలప్రళయం సంగతి అందరికీ అనుభవమే.రిజ్వరా§్‌ు నీటిమట్టం సామర్థ్యం 24 అడు గుల కన్నా ఎక్కువస్థాయి రావడంతో ఒకేసారి రిజర్వాయర్‌ గేట్లు తెరవడంతో ఉప్పెన సునామిలా చుట్టువేసింది.

269 మంది ప్రాణా లను కోల్పోయారు.మూడు మిలియన్‌ల మందికి పదిహేను రోజుల పాటు కనీసఅవసరాలు సహాయం అందకుండా పోయాయి. 18వేల మంది తినడానికి గుప్పెడు మెతుకులు దొరక్కా కొన్నిరోజుల పాటు ఆకలితో అలమటించాల్సివచ్చింది. దీనికంతటికి కారణం అక్రమ నిర్మాణాలు.చెన్నైలో జనం రద్దీతో నిండే ముడిచూరు,వెలవెర్రి, ఎరికరవై నివాసాలు మూడువందల చెరువ్ఞల్లో పుట్టుకొచ్చాయి. దీంతో పర్యావరణ వనరులు, పరిసరాలు దెబ్బతిన్నాయి. చెన్నైలోని బకింగ్‌హమ్‌ కాల్వపై మాస్‌రాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ రైలు పనులు ప్రారంభించడంతో బ్రిటిషు కాలంనాటి ఆ కాలువ చిరునామా లేకుండా పోయింది. అలాగే బెంగళూరులో 2000-14 మధ్యకాలంలో నిర్మాణాలు అమాంతగా విస్తరించడంతో జలవనరుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. హైదరాబాద్‌లో అరవైఏళ్ల క్రితం నగరం చుట్టుపక్కల మొత్తం 932 చెరువ్ఞలు ఉండేవని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ గుర్తించింది. కానీ ఆ చెరువ్ఞలను పాలకవర్గాల మితిమీరిన స్వార్థం వల్ల వాటి స్వరూపాలు కనబడకుండాపోయాయి. బంజార హిల్స్‌ పెద్దచెరువ్ఞ జలగం వెంగళరావ్ఞ పార్కుగా, యూసుఫ్‌గూడ చెరువ్ఞ కృష్ణకాంత్‌పార్కుగా,మాసబ్‌ట్యాంక్‌ను చాచానెహ్రూ పార్కు గా మార్చివేశారు.ఇటీవల 2857 చెరువ్ఞలను హెచ్‌ఎంటిఎ పరిధి లో గుర్తించారు.

వీటిలో 1976చెరువ్ఞలకు సర్వే పూర్తి అయింది. నీటి పారుదల అభివృద్ధిశాఖ 1902 చెరువ్ఞలను గుర్తించింది. వాటి లో 807 చెరువ్ఞలకు పునరుద్ధరణ పనులు చేపట్టడానికి సిద్ధమ య్యారు. ప్రాథమిక దశలో 744 చెరువ్ఞల పనులు చేపట్టడానికి అందులో 215చెరువ్ఞలను తక్షణంతీర్చిదిద్దడానికి సిద్ధమవ్ఞతున్నా రు. అయితే ఈ చెరువ్ఞలన్నీ ఇంతకాలం ఎక్కడ ఉండేవో ఎలాంటి పరిస్థితిలో ఉండేవో ఎవరూ చెప్పలేని అయోమయం ఏర్పడడంతో ఏమాత్రం వర్షం పడినా ఆ చెరువ్ఞలకు చేరాల్సిన నీరు ఎటూ వెళ్లే దారికి లేక ఒక్కసారి పరిసరాలను ముంచెత్తడం ప్రారంభిస్తున్నా యి. చెరువ్ఞల సంగతి ఎలా ఉన్నా నాలాల పరిస్థితి చూస్తే నగరం లో 3890 కిలోమీటర్ల పొడవ్ఞన నాలాలున్నాయి. ఈ నాలాలపై రెండు లక్షల నివాసాలు అక్రమంగా ఏర్పడ్డాయి. వీటివలన స్టార్మ్‌ వాటర్‌ కాని, డ్రైనేజీ వాటర్‌ కాని వెళ్లే దారిలేక ఒక్కసారి వర్షం నీటి తో నాలాల మురికినీటి ప్రవాహం కలిసి పెల్లుబుకుతోంది. 2000 సంవత్సరంలో నగరాన్ని ముంచెత్తిన వరద నీరు ఎంతటి ప్రళయం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆనాడు 558 అక్రమ అక్రమణ లను నాలాలపై తొలగించారు.జిహెచ్‌ఎంసి 28వేల ప్రాంతాల్లో ఆక్రమణలు జరిగి నట్లు గుర్తించింది. ప్రస్తుత అవసరాల ప్రకారం ఈ నాలా వ్యవస్థని పునరుద్ధరించడం అసాధ్యమని అధికారయం త్రాంగం చేతులెత్తేస్తుంది. అలాగే ఈ ఆక్రమణలను తొలగించాలంటే పదివేల కోట్లరూపాయలు అవసరమవ్ఞతాయని అంత ఆర్థికవ్య యాన్ని భరించే శక్తి ప్రభుత్వానికి లేదని స్పష్టమవ్ఞతోంది. ఈ నేపథ్యంలొ ఏమాత్రం చినుకుపడినా నాలాలు కాలనాళికలై జనం ప్రాణాలు తీస్తున్నాయి. నాళాలనుంచి నీరు సరిగ్గా పారక చెరువ్ఞల్లో నీరు చేరక ఒక్కసారి ఉప్పెన సంభవిస్తోంది.

గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాల ఫలితంగా అపార్ట్‌ మెంట్లు, కాలనీలు,లోతట్టు ప్రాంతాలు ఏవిధంగా మునిగిపోతున్నా యో మనం ఆనరకాన్ని అనుభవిస్తున్నాం. హైదరాబాద్‌లో సగటు వర్షపాతం 80 సెం.మీ కాగా ఇటీవల ఒక అరగంటలోనే మూడు సెం.మీ.వర్షం కురిసిందంటే గత నెలరోజులుగా ఎన్ని సెం.మీవర్షం కురిసిందో అదిఎంతటి విపత్తుకు దారితీస్తుందో మనం విశ్లేషించ వచ్చు.ఇక ఢిల్లీనగరాన్ని పరిశీలిస్తే యమునానది పరీవాహక మైదా న్‌ ప్రాంతంలోని అరవైఎకరాల్లో మిలీనియం పార్కు ఒక డిపో నిర్మాణాన్ని చేపట్టారు.తూర్పు,దక్షిణఢిల్లీ ప్రాంతాలను అనుసంధా నించే బాలాపుల్లా వంతెన ప్రాజెక్టు మూడోదశ నిర్మాణాన్ని ఎలాంటి ప్రణాళిక లేకుండా అనాలోచితంగా చేపట్టారు. ఈ కారణంగా యమునా నది ప్రవాహ గమనమే మారిపోయింది.బెంగళూరులో 2000-14 మధ్యకాలంలో నిర్మాణాలు విపరీతంగా పెరిగాయి. ఈ విధంగా నగరాలు అస్తవ్యస్తంగా విస్తరించడంతో ఏమాత్రం చినుకు పడినా అది చేటే తప్ప ఎవరికి ఎలాంటి రక్షణ ఉండదు.

-పెట్ల వెంకటేశం