కబ్జాలతో మూసీకి ముప్పు

                                    కబ్జాలతో మూసీకి ముప్పు

MUSI RIVER
MUSI RIVER

                                             అక్రమ నిర్మాణాలతో పరివాహక ప్రాంతాలు అన్యాక్రాంతం
                                          అటకెక్కన ఆధునీకరణ పనులు..రెచ్చిపోతున్న కబ్జాదారులు
                                           వర్షకాలం సమీస్తున్న నిద్రమత్తులో జోగుతున్న అధికారగణం
హైదరాబాద్‌: నాడు జీవనదిగా భాగ్యనగరానికి నీరందించిన మూసీ కాలక్రమేనా మూరికి కూపంగా మారింది. దీనికి తోడు నది పరివాహాక ప్రాంతాలు కబ్జాదారుల చెరలో పడి కుచించుకుపోయి ఉనికిని కొల్పొయే ప్రమాదంలో పడింది. గత కొన్నేళ్ళు ప్రభుత్వాలు మూసీ నది ఆధునీకరణ పేరుతో సంస్కరణలు చేపట్టిన అది కాగితాలకే పరిమితమవడంతో పరివాహాక ప్రాంతంలో దర్జాగా అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన మూసీ నది పరివాహాక ప్రాంతాన్ని కాపాడడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వర్షకాలం సమీపిస్తున్న సమీపంలో మూసీ ఆధునీకరణపై ప్రణాళికలు సిద్దం చేసినా అధికారుల నిర్లక్ష్యంతో అట్టి పనులు అమలుకు నోచుకోవడం లేదు. ఆధునీకరణ పనులు దెవుడెరుగు..ఉన్న మూసీ నది పరివాహాక ప్రాంతాన్ని పరిరక్షంచడంలో అధికారులు దృష్టి సారించక పోవడంతో రోజురోజుకు ఆక్రమణల పర్వం జోరుగా కొనసాగుతూ కుచించుకుపోతున్నది.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, హెచ్‌ఎండిఎ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసి, పోలీసు, విజిలెన్స్‌ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక అధికారుల చేతివాటం కబ్జాదారులకు వరంగా మారడంతో మూసీకి ముప్పు వాటిల్లుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేసి పరివాహాక ప్రాంతాన్ని సుందరీకరించి పూర్వవైభవం తీసుకురావడానికి చేస్తున్న కృషి నేటి సాకారం కాకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా రామంతాపూర్‌ భగాయత్‌ గడ్డి భూముల్లో సిఎం కెసిఆర్‌, మంత్రి కెటిఆర్‌ల పేరుతో వెలసిని కెసిఆర్‌నగర్‌, కెటిఆర్‌నగర్‌ బస్తీలకు సమీపంలో ప్రవహిస్త్ను మూసీ నది పరీవాహాక ప్రాంతంలో గత కొంతకాలంగా కొందరూ వ్యక్తులు లారీలతో మట్టిని తీసుకువచ్చి బహిరంగంగానే నిత్యం డంప్‌ చేసున్నప్పటికి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అంబర్‌పేట, గోల్నాక ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలిస్తే మూసీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. రియల్‌ వ్యాపారం ముసుగులో మూసీ పరీవాహాక ప్రాంతంలో మట్టిని నింపుతూ ప్లాట్లుగా విభజించి విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారు.

సదరు ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు ఏలాంటి అనుమతులు పొందకుండానే నిర్మాణాలను కొనసాగిస్తున్నప్పటికి సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడప్పుడూ తనిఖీల పేరుతో హెచ్‌ఎండిఎ విజిలెన్స్‌, రెవెన్యూ, జిహెచ్‌ఎంసి సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అందినకాడికి దండుకొని ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. దీనికి తోడు మరికొందరూ రాజకీయ పార్టీ నేతలుగా చెలామణి అవుతూ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగా ఆక్రమణల పర్వంతో రోజురోజుకు మూసీ నది మరింత కుచించుకుపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైన ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి మూసీ పరివాహాక ప్రాంతాలను కబ్జాల చెరు నుండి రక్షించి మూసీ పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు.
మూసీ ద్వారానే బయటకు. . .
హైదరాబాద్‌ నగరంలో నీళ్ళు మూసీ ద్వారానే బయటకు వెళ్ళే అవకాశం ఉంది. నగరం శరవేగంగా అభివృద్ది చెందడంతో పాటు జనాభ అదే స్థాయిలో పెరుగుతోంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌ మధ్య నుండి మురికి నీరు బయటకు పోయేందుకు మూసీ ఒక్కటే మార్గం. అలాంటి మూసీ నది వెడల్పూ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆక్రమణల పర్వంతో ఇప్పటికే మూసీ నది రివర్‌బెడ్‌ నలభైశాతం తగ్గినట్లు తెలుస్తుంది. మూసీ నది పాతబస్తీలోని ఆరు అసెంబ్లీ స్థానాలను తాకుతూ ప్రవహరిస్తూ బయటకు వెళ్తుంది. మూసీ నదిని ఆక్రమించుకొని ఎన్నో ఆక్రమణలు జరుగుతున్నప్పటికి ఇప్పటి వరకు ఏప్రభుత్వం సరియైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఒక వేళ భారీ వర్షాలు వస్తే వరద నీటితో అనేక కాలనీలు ముంపుకు గురవ్వడంతో పాటు భారీనష్టం తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.