కబళిస్తున్న కాలుష్యం

                             కబళిస్తున్న కాలుష్యం

pollution
pollution

అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం బారి నపడి మృతిచెందుతున్నవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండడం కలవరపరు స్తున్నది. ప్రధానంగా గాలిలో ప్రమాదకరమైన ధుమ్ము కణాల సంఖ్య పెరిగిపోతుండడం ప్రజారోగ్యంపాలిట పెను శాపంగా పరిణమిస్తున్నది. స్వచ్ఛమైన గాలి పీల్చినప్పుడే మనిషి మనుగడ సాగుతుంది. దీర్ఘాయుష్షు అవ్ఞతాడు. ప్రపంచంలో తొంభై శాతానికి పైగా ప్రజలు పీలుస్తున్న గాలి నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ వాయుకాలుష్య నివేదిక వెల్లడిం చింది. ఈ విషయంలో పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలోని ధూళికణాల కారణంగా మనిషి శరీరంలో కీలక అవయవాలు, ఊపి రితిత్తులు, గుండె, మెదడు తదితర విభాగాలపై ఈ ప్రభా వం చూపుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఈ వ్యాధుల కార ణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ముఫ్పైఐదులక్షలకుపైగా మరణాలు సంభవిస్తున్నట్లు అనేక నివేదికలు వెల్లడిస్తున్నా యి. మొత్తం అన్ని రకాల వాయుకాలుష్యకారణాల వల్ల జరిగే మరణాలను నివారించడంలో విఫలమవ్ఞతున్నారనే చెప్పొచ్చు.

ఇందుకోసం కాలుష్యం ద్వారా ఏర్పడే పరిణా మాలు అది మానవ జీవనంపై చూపుతున్న దుష్ప్రభావాల గురించి పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా ఏడాదికేడాదికి ఇది పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు.ముఖ్యంగా నగరాల పరిస్థితి ఆందోళనకరంగా తయారవ్ఞతున్నది. ప్రస్తుతం ప్రపంచజనాభాలో దాదాపు సగం నగరాల్లోనే నివసిస్తున్నా రు. 2050 నాటికి నగర జనాభాకు మరో మూడువందల కోట్లకుపైగా జమ అవ్ఞతుందని అంచనా వేస్తున్నారు. మొ త్తం భూభాగంపై నగరాల వైశాల్యం దాదాపు రెండు శాతం అయినప్పటికీ ఆర్థిక రథానికి కావలసిన చోదకశక్తి అక్కడి నుంచే అందుతున్నది. ప్రపంచవ్యాప్తంగా స్థూల దేశీయో త్పత్తిలో దాదాపు అరవై శాతం ఆరువందల పట్టణ కేంద్రా ల నుంచే జరుగుతుందంటే నగరాల, పట్టణాల ప్రాధాన్యత ఎంతగా పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం లో కూడా పట్టణీకరణ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. ముఖ్యంగా గ్రామాల్లోనెలకొన్న పరిస్థితులు జీవనోపాధి దొ రక్క ఇప్పటికీ కనీస వసతులు లేక గ్రామాలు వదిలి నగ రాల బాటపడుతున్నారు.పట్టణాల్లో 2001లోపట్టణప్రాంత జనాభా ముప్ఫైకోట్లలోపే ఉండగా ఇప్పుడది రెట్టింపు అయిందని అనధికార అంచనాలు చెబుతున్నాయి.

ఇంకా ఊహించని విధంగా పట్టణాలకు,నగరాలకు పెద్దఎత్తున తరలివస్తుండడంతో వాటిపై ఒత్తిడి పెరుగుతున్నది. గృహ నిర్మాణం, పారిశ్రామిక, వాహనాల విషయంలో ఒక పద్ధతి ప్రణాళిక లేకుండాపోతున్నది. వాతావరణం విషకలుషితమై స్వచ్ఛమైన నీరు,గాలిఅందకుండా పోతున్నది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కాలుష్య నివారణకు చేపడుతున్న పథకా లు ఏమాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. 2005లో ప్రారంభించిన జవహర్‌లాల్‌నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం కింద పట్టణ ప్రాంతాలకు జవసత్వం కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్న ప్పటికీ పెరుగుతున్న అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. భారతదేశంలో ఉన్న ఆరు మెట్రో నగరాల్లో ఢిల్లీ, చెన్నై,బెంగళూరు,హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబాయిలలో గతంలో జరిపిన సర్వేలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పర్యావరణం, గాలి, నీటి నాణ్యత, అట వీ విస్తీర్ణం, పచ్చదనం, వాతావరణం మార్పు, చెత్తా, తది తర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని జరిపిన ఈ సర్వే లో దట్టంగా అలుముకున్న వాయుకాలుష్యం నగర జీవి ఊపిరితిత్తులకు తూట్లుపొడుస్తుందనిహెచ్చరించింది.

బెంగ ళూరులో పరిశ్రమల కారణంగా వాయుకాలుష్యం తీవ్రస్థా యికి చేరితే హైదరాబాద్‌లో నిర్మాణరంగం వల్ల గాలి, ధూళికలు అధికంగా చేరుతున్నట్లు ఆ సర్వేలో బయటప డింది.దీనికంటే వాహన కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు హైద రాబాద్‌ మహానగరంలో కలుషిత నీటికి విపరీత వాయు కాలుష్యం తోడై ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. ఇప్పటికీ నగర రోడ్లపై నడిచే వాహనాలు ముఖ్యంగా లారీలు, ఆటో లు, హరిత నిబంధనలను తుంగలో తొక్కుతూ పెద్దఎత్తున పొగవదులుతూ కళ్లు,ఒళ్లు మండిస్తున్నా అధికార యం త్రాంగం అటువైపు చూసే ఓపిక, తీరికా లేకుండాపోవడం దురదృష్టకరం. నేల,రహదారుల నుంచి లేచే ధూళి, పరిశ్ర మల పొగ, గృహోపకరణాల కణాలు, పుప్పొడి రేణువ్ఞలు, వివిధ రకాల బూడిద, ద్రవ బిందువ్ఞలు, లోహపదార్థాలు, అమోనియం, కార్బన్‌మోనాక్సైడై వంటి రసాయనాలు తది తరాలు గాలిలో తేలుతుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఈ కణాలు 2.5 మైక్రోమీటర్ల వ్యాసం తక్కువగా ఉంటే అవి ఆరోగ్యానికి తీవ్ర హానికరం.

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల దాదాపు వంద దేశాల్లోని మూడువేల నగర ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఊపిరితిత్తులు, హృదయనాళ వ్యవస్థల్లోకి సుల భంగాచొచ్చుకుపోయే అతిప్రమాదకరమైన సల్ఫేెట్‌,నైట్రేట్‌, కార్బన్‌, తదితర రసాయనిక ధూళికణాలు 2.5 మైక్రోమీ టర్లస్థాయిలోఉన్నట్లు గుర్తించారు. వాయుకాలుష్యం మనిషి కేకాదు. దేశ సుసంపన్న చరిత్ర సంస్కృతులకు ప్రతీకలుగా భాసిల్లుతున్న వారసత్వకట్టడాలను కూడా కబళించే ప్రయ త్నం చేస్తున్నది. దేశంలో ముప్ఫై తొమ్మిది నగరాల్లో నూట నలభై వారసత్వ కట్టడాల పరిసరాల్లో వాయుకాలు ష్యం స్థాయిలను పరిశీలిస్తే ఆందోళనకరంగా ఉన్నట్లు బయ టపడింది. వాయుకాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమ స్య. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పాలకులపైనే బాధ్యత అంతా వదిలిపెట్టకుండా స్వచ్ఛందసంస్థలు, ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాల్సిన తరుణమిది. గాలిలో ధూళికణాలను వెదజల్లే చర్యలకు అడ్డుకట్టవేయాలి. అలాగే కాలం చెల్లిన మోటార్‌ వాహనాల వాడకాన్ని నిరోధించాలి. అవసరం అయితే చట్టానికి మరింత పదునుపెట్టాలి.
– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌