కపిల్‌ రికార్డును అధిగమించిన అశ్విన్‌

ASHWIN1
ASHWIN1

కపిల్‌ రికార్డును అధిగమించిన అశ్విన్‌

 

పూణే: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ ద్వారా అత్యంత వేగంగా 250 వికెట్లను సాధించిన రికార్డును సొంతంచేసుకున్న భారత ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌ తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మరో ఘనతకు చేరుకున్నాడు.శుక్రవారం రెండవరోజు ఆటలో భాగంగా ఆసీస్‌ రెండవ ఇన్నిం గ్స్‌లో తొలి రెండువికెట్లను అశ్విన్‌ తీసుకున్నాడు.దీంతో 2016-17స్వదేశీ సీజన్‌లో అశ్విన్‌ 64 వికెట్లు సాధించాడు.తద్వారా ఒక స్వదేశీ సీజన్‌లో వేగంగా అత్యధికవికెట్లను తీసిన ఘనత సాధించాడు. దీంతో ఆసీస్‌ కపిల్‌దేవ్‌ పేరిట ఉన్న రికార్డును అశ్విన్‌ సవరించాడు.1979-80 హోంసీజన్‌లో కపిల్‌ దేవ్‌ 13టెస్టుల్లో 63వికెట్లు తీయగా,2016-17 స్వదేశీ సీజన్లఓ అశ్విన్‌ ఆ రికార్డును అధిగమించాడు. 10టెస్టుల్లో 64 వికెట్లతో అశ్విన్‌ ఆరికార్డును చెరిపి వేశాడు.ఈరోజు ఆసీస్‌రెండవ ఇన్నింగ్స్‌లో భాగంగా డేవిడ్‌ వార్నర్‌, షాన్‌మార్ష్‌లను పెవిలి యన్‌కు పంప డం ద్వారా అశ్విన్‌ ఈఘతన సాధించాడు.గతంలో ఈ రికార్డుకు అశ్విన్‌ దగ్గ రగా వచ్చినప్పటికి దాన్ని అధిగమించలేకపో యాడు. 2012-13 స్వదేశీ సీజన్‌లో అశ్విన్‌10 టెస్టుల్లో 61వికెట్లు మాత్రమే తీసి ఆరికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. అయితే సుమారు మూడు సీజన్‌ల తరువాత ఆరికార్డును అశ్విన్‌ బద్దలు కొట్టడం ఇక్కడ విశేషం.