కన్నుమూసిన కురువృద్ధుడు

 

oldest man
ప్రపంచంలోనే అత్యంత వయో వృద్ధుడిగా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కిన యునుతారో కోయిడ్‌ మృతిచెందారు. జపాన్‌కుచెందిన కోయిడ్‌ వయస్సు 112 సంవత్సరాలు.. జపాన్‌లో మార్చి 3వ తేదీ 1903లో జన్మించారాయన. సెంట్రల్‌ జపాన్‌లోని ఒక వైద్యశాలలో హృదయ సంబంధిత వ్యాధితో చికిత్సపొందుతూ కన్నుమూశారు. మరో 2 నెలల్లో ఆయన 113వ జన్మదినాన్ని జరుపుకోనున్న తరుణంలో ఆయన తనువు చాలించారు.