కన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు
జోరున వర్షంలోనే ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ అంత్యక్రియలు
ప్రజలు, కార్యకర్తలు కన్నీరుమున్నీరు..
విశాఖపట్నం/పాడేరు : మావోయిస్టులు ఘాతుకానికి బలైన ప్రభుత్వ విప్, అరకు శాసనసభ్యులు కిడారి సర్వేశ్వరరావ్ఞ, మాజీ శాసనసభ్యులు సివేరి సోమకు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. కిడారి సర్వేశ్వరరావ్ఞ పాడేరులో అంత్యక్రియలు జరిపారు. సివేరి సోమకు అరుకులో అంత్యక్రియలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు. గనుల శాఖ మంత్రి సుజ§్ు కృష్ణ రంగారావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కె.ఎస్. జవహార్, రోడ్డు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, విశాఖ విమానాశ్రయం నుండి హెలికాప్టర్లో బయలుదేరి అరకు చేరుకున్నారు.
అక్కడ మాజీ శాసనసభ్యులు సివేరి సోమ భౌతికకాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలు దేరి పాడేరు చేరుకున్నారు. పాడేరులో కిడారి సర్వేశ్వరరావ్ఞ భౌతికకాయానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఆయన కుటుబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇటువంటి అమానుష చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని తీవ్రంగా ఖండించారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ఎం.శ్రీనివాసరావ్ఞ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలాం భవాని భాస్కర్, శాసనమండలి సభ్యులు పప్పల చలపతిరావ్ఞ, పివిఎన మాదవ్, గుమ్మడి సంధ్యారాణి, గాదె శ్రీనివాసులు నాయుడు,శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, జి.వి.ఆర్.నాయుడు, వాసుపల్లి గణేష్ కుమార్, పంచకర్ల రమేష్‌బాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావ్ఞ, గిడ్డి ఈశ్వరి, వంగలపూడి అనిత తదితరులు సర్వేశ్వరరావ్ఞకి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ జి.సృజన ఐటిడీఎ పీవో డి. కె. బాలజీ. జిసిసిఎండి టి.బాబురావ్ఞనాయుడు పోలీస్ శాఖ అడిషనలత్ డీజీలు జి. హరీష్‌రావ్ఞ గుప్తా, డిఐజీ ఎబి. వెంకటేశ్వరులు, శ్రీకాకుళం ఎస్పి త్రివిక్రమ్ వర్మ, పాడేరు నర్సీపట్నం ఏఎస్పీలు ఆరిప్ హపీజ్, అమిత్ బర్దర్ తదితరులు కిడారి సర్వేశ్వరరావ్ఞకు శ్రద్ధాంజలి ఘటించారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి దివంగత నేతకు నివాళులర్పించారు.అమర్ రహే కిడారి సర్వేశ్వరరావ్ఞ అంటూ భారీ ర్యాలీప్రభుత్వ విప్ అరకు శాసనసభ్యులు కిడారి సర్వేశ్వరరావ్ఞ అకాల మరణాన్ని జీర్ణించుకోలేని గిరిజన ప్రజానీకం, పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గిరిజనాభివృద్ధికి అహర్నిశలు పాటుపడే గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయామని అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కిడారి సర్వేశ్వరరావ్ఞ పార్ధివదేహంతో పాడేరు ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించి అమర్‌రహే కిడారి సర్వేశ్వరరావ్ఞ అంటూ వెలిగెత్తి చాటారు. మావోయిస్టులది అనాగిరిక, అమానుష చర్య అంటూ తీవ్రంగా ఖండించారు. పాడేరు సిరి కల్చర్ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన కిడారి సర్వేశ్వరరావ్ఞ అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అధికారులు, గిరిజన ప్రజానీకం పెద్దఎత్తున హాజరై తమ ప్రియతమ నాయకునికి కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.