కనిగిరిలో పట్టపగలు చిన్నారి కిడ్నాప్‌

Sahastra kidnapped
– బైకుపై వచ్చి ఇంటి నుండి అపహరించిన దుండగులు
– కిడ్నాప్‌ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన పోలీస్‌యంత్రాంగం
కనిగిరి : కనిగిరిలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. విఐపిలు ఎక్కువగా నివాసించే ప్రధాన వీధిలో పట్టపగలు అందరు చూస్తుండగానే బైకుపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు దేవిరెడ్డి సహస్త్ర(6)ను అపహరించుకు పొవడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. కిడ్నాప్‌కు గురైన సహస్త్ర తల్లి దండ్రులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవిరెడ్డి మల్లేశ్వరి, కనిగిరి ఎస్సై యు.శ్రీనివాసులు తెలిపిన వివరాలమేరకు సహస్త్ర గురువారం పాఠశాలకు వెళ్ళి వచ్చి ఇంటి ముందు అడుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి ఎత్తుకుపొయినట్లు తెలిపారు. బైకు వచ్చిన ఇరువురు యువకులు, ముఖానికి హెల్మెట్‌ దరించి ఇంటికి వచ్చారని, ఇంటి ముందు అడుకుంటున్న శ్రీనివాసరెడ్డి ఇద్దరు పిల్లలు సహప్రస్త,లాస్యల దగ్గరకు వచ్చారన్నారు. లాస్యను నెట్టివేసిన దుండగులు సహస్త్రను పల్సర్‌ బైకుపై ఇరువురు మద్యలో కుర్చోబెట్టుకుని తాళ్ళూరువైపు పరారయ్యారన్నారు. చిన్నారి కిడ్నాప్‌కు గురైందన్న సమాచారంతో ఉపాద్యాయులైన తల్లి దండ్రులు శ్రీనివాసులు, మల్లేశ్వరిలు కుప్పకులి పొయారు. బంధువులు, తోటి ఉపాధ్యాయులు, సమీప గృహాస్థులు ఆందోళనకుగురయ్యారు. ఎప్పుడు చిన్నారుల కిడ్నాప్‌లు జరుగక పోవడంతో కనిగిరిలో సహస్త్ర కిడ్నాప్‌ సంచలనంగా మారింది.