కథువా బాధితురాలి వివరాలు గోప్యంగా ఉంచండి: హైకోర్టు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌ లోకి కథువా సామూహిక అత్యాచారం, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక ఫోటోను, పేరును వెల్లడించవద్దని ఢిల్లీ హైకోర్టు మీడియాను ఆదేశించింది. బాధితురాలి ఫోటో, పేరు ఇప్పటికే పలు మీడియాలలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పేరును, ఫోటోను ప్రసారం చేయడం కానీ, ప్రచురించడం కాని చేయవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.