కథలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ రెండు జన్మలు

puri jaganath
puri jaganath

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో ‘మెహబూబా’ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు సందర్బంగా పూరి ఈ చిత్రాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసి హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ. 1971 ఇండో-పాక్ యుద్ధం నైపథ్యంలో సాగే సినిమా. ఇది నా తరహా సినిమాలకి పూర్తి భిన్నమైంది అంటున్న పూరి ఈ కథలో మరొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా మిళితం చేసినట్టు తెలుస్తోంది. ఏమిటంటే ఈ కథలో హీరో హీరోయిన్లు ఇద్దరికీ రెండు జన్మలుంటాయని, గతంలో చనిపోయిన ఇద్దరూ మళ్ళీ ప్రస్తుతంలో పుట్టడం వంటి ఆసక్తికరమైన పాయింట్ ఈ కథలో ఉందని సమాచారం. మరి పూరి ఈ ఆసక్తికరమైన కథను తన టేకింగ్ తో ఇంకెంత ఆసక్తికరంగా తెరకెక్కిస్తారో చూడాలి. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి జగన్ టూరింగ్ టాకీస్ పై నిర్మితంకానున్న ఈ చిత్రంలో ఆకాష్ పూరికి జంటగా కొత్త హీరోయిన్ నేహా శెట్టి నటిస్తోంది.