కత్తిమీద సాములా మారిన రెండో టెస్టు జట్టు కూర్పు

TEAM INDIA
TEAM INDIA

కత్తిమీద సాములా మారిన రెండో టెస్టు జట్టు కూర్పు

న్యూఢిల్లీ: గాలె టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత రెండో టెస్టుకు భారత జట్టు కూర్పు సెలెక్టర్లకు కత్తిమీద సాములా మారింది. నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉండటం…గాలె మ్యాచ్‌లో అందరూ రాణించడంతో టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లీలకు పెద్ద సమస్యగా మారింది. జ్వరంతో లోకేశ్‌ రాహుల్‌ తొలి టెస్టుకు దూరం కాగా అతని స్థానంలో అభినవ్‌ ముకుంద్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అభినవ్‌ నిరాశపరిచినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి కెప్టెన్‌ కోహ్లీకి మద్ధతుగా నిలిచాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలుత జట్టులో చోటు దక్కకపోవడంతో హాంకాంగ్‌ హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు.

అనంతరం మెల్‌బోర్న్‌ వెళ్లి వన్డేలకు సిద్ధమవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. కానీ టెస్టు రెగ్యులర్‌ ఓపెనర్‌ మురళీ విజ§్‌ు గాయంతో సిరీస్‌ మొత్తానికి దూరంకావడంతో అనూ హ్యంగా ధావన్‌కు చోటుదక్కింది. టెస్టుఓ్ల మళ్లీ ఆడాలనే ధృడ సంకల్పంతో ఉన్న ధావన్‌ అందిన అవకాశాన్ని అందిపుచ్చుకుని చెలరేగాడు. తొలి ఇన్నింగ్‌్‌సలో అద్భుత బ్యాటింగ్‌(190)తో అజేయ సెంచరీ సాధించాడు. గతేడాది న్యూజిలాండ్‌ సిరీస్‌లో గాయపడి జట్టుకు దూరమైన రోహిత్‌ శర్మ…ఛాంపియన్స్‌ ట్రోఫీలో చోటు దక్కించుకొని అదరగొట్టడంతో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టులో అవకాశం లభించలేదు.

రెండో టెస్టులోనైనా చోటు దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానె, పాండ్యాలు కూడా రాణిం చడంతో జట్టు కూర్పు పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న రహానెను నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తుండగా…నలుగురు ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్థంకాక కోచ్‌, కెప్టెన్‌లు తలబాదుకుంటున్నారు.