కడుపులో గడబిడ

Stomach
Stomach

కడుపులో గడబిడ

కడుపు మొత్తం గ్యాస్‌తో ఉబ్బి ఉండి, కడుపులో నొప్పిగా ఉంటుంది. విరేచనము వచ్చినట్లుగా ఉంటుందిని రాదు. ఒక వేళ విరేచనం అయితే వరుసగా అవ్ఞతుంటాయి. లేదంటే విరేచనం అసలే కాదు. ఇది ఏమి వ్యాధి అబ్బా అని.. పరీక్షలన్నీ చేయించినా అన్ని నార్మల్‌గానే వస్తాయి. కాని వ్యాధి మాత్రం వేదిస్తునే ఉంటుంది. ఈ నవీనయుగంలో చాలా మందిని బాధిస్తున్న ఈ సమస్యనే వైద్య పరిభాషలో ‘ఐ బి ఎస్‌ (ఇర్రిటేబుల్‌ బోవెల్‌ సిండ్రోబ్‌) అంటారు. దీనికి కారణ మారిన జీవనశైలి విధానాలే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం, వీటితో పాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్లు తోడు కావడంతో ఐబిఎస్‌ సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది.

ఇంతగా వేధిస్తున్న ఈ వ్యాధిని నివారించటానికి హోమియో వైద్యంలో మంచి మందులు ఉన్నాయి. వ్యక్తి శారీరక, మానసిక లక్షణాలను, అలవాట్లు జీవనవిధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం చేసిన మంచి ఫలితం ఉంటుంది. లక్షణాలు: కడుపు నొప్పి స్వల్పంగా గాని, మెలిపెట్టినట్లుగా గాని ఉంటుంది. తేన్పులు ఎక్కువగా ఉండటం. గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం. కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం మల విసర్జన సరిగా పూర్తిగా కాదు. కొన్ని సందర్భాలలో భోజనం చేసిన వెంటనే మల విసర్జనకు వెళ్లాలనిపించటం. నీరసంగా ఉండటం, ఏకాగ్రత లోపించటం. నీళ్ల విరోచనాలు కాని, జిగట విరోచనాలు గాని కనిపిస్తాయి. తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం. జీవన విధానం సక్రమంగా జరుగక ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగును. జాగ్రత్తలు: ఫాస్ట్‌ ఫుడ్స్‌, ఆయిల్‌ఫుడ్స్‌, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి.

నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. నీరు సరిపడినంతగా తాగాలి. టీ, కాఫీలు మానివేయాలి మానసిక ఒత్తిడిని నివారించటానికి యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి. మందులు : లైకోపోడియం: వీరు మలబద్దకంతో బాధ పడుతుంటారు. మల విసర్జన సాఫీగా జరుగక ముక్కలు ముక్కలుగా వస్తుంటుంది. వీరు కొంచెం తినగానే పొట్ట ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. వీరికి బాధలన్ని సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల మధ్యలో ఎక్కువగా ఉంటాయి. మానసిక స్థాయిలో వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. వీరికి లోపల భయం ఉన్నా పైకి మాత్రం భయం లేనట్లుగా వ్యవహరిస్తారు. వీరికి అహంభావం ఎక్కువగా ఉంటుంది. వీరు సమాజంలో లీడర్‌లాగా ఉండాలనుకుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి.

నైట్రోమోర్‌: వీరికి మలం పెంటిక లాగా అవ్ఞతుంటుంది. వీరు తల నొప్పితో బాధపడుతుంటారు. వీరికి ఉప్పు చాలా ఇష్టం. వీరికి బాధలన్ని ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్యలో ఎక్కువగా ఉంటాయి. వీరు ఓదార్పును ఇష్టపడరు. అలాగే వీరు దుఃఖ భారంతో కుంగిపోయి ఉంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించగదగినది. నక్స్‌వామికా: విరేచనం ఒకేసారి కాకుండ మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది. పొట్టలో గ్యాస్‌తో సతమతమవ్ఞతుంటారు. మసాలాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌, కాఫీలు ఎక్కువగా సేవించడం, శారీరకశ్రమ తక్కువగా ఉండి, మానసిక శ్రమ ఎక్కువ, ఎప్పుడు పని గురించే ఆలోచిస్తూ ఉన్నవారికి ఈ మందు ఆలోచించదగినది. మానసిక స్థాయిలో వీరికి కోపం ఎక్కువ. శబ్దాలు, వెలుతురు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా పని చేస్తుంది. యాలోస్‌ : వీరికి పొట్టలో గ్యాస్‌ ఎక్కువగా ఉండి, విరేచనం ఆపుకోలేనంత వేగంగా వచ్చును. వీరు బాత్‌రూంకి వెళ్లేంత లోపలనే మల విసర్జన జరిగిపోతుంది. వీరికి మల విసర్జన గ్యాస్‌తో పాటుగా నీళ్లు నీళ్లుగా అగును.

ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు ప్రయోజనకారి. అర్టెంటం నైట్రికం: పొట్టలో నొప్పి ఉండి తేన్పులు ఎక్కువగా ఉంటాయి. తిన్న తరువాత పొట్టలో నొప్పి ప్రారంభమవ్ఞతుంది. వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు. ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా ఏదైనా పని తలపెట్టినా గందరగోళంలో పడిపోతారు. ఎనాకార్డియం: వీరికి పొట్టలో నొప్పి ఏదైనా తిన్న తరువాత తాత్కాలికంగా తగ్గుతుంది. మళ్లీ నొప్పి రెండుగంటల తరువాత మొదలవడం గమనించదగిన లక్షణం. వీరు మానసికస్థాయిలో మతిమరుపు ఎక్కువగా ఉండి, దుర్భాషలాడే స్వభావంతో ఉంటారు. ఇటువంటి వారికి ఈ మందు బాగా పని చేస్తుంది. ఆర్సినికం ఆల్బం: ఈ మందు జీర్ణాశయ వ్యాధులకు తప్పక ఆలోచించదగినది.

కడుపులో గడబిడలతో తేన్పులు రావడంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, నీళ్ల విరోచనాలు, జిగట విరోచనాలు, తరుచుగా దాహం, ఒళ్ల నొప్పులు, మానసికస్థాయిలో ఆందోళన భయం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది. ఫాస్పరస్‌ : పొట్టలో అల్సర్‌ ఉండి వీరికి రక్తం కూడా పడుతుంటుంది. విపరీతమైన నొప్పి ఉంటుంది. చల్లటి పదార్థాలు ఐస్‌క్రీంలు తింటే నొప్పి ఉపశమిస్తుంది. వీరు మానసిక స్థాయిలో భయస్తులు. ఉరుములు, మెరుపులు అంటే భయపడతారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు ప్రయోజనకారి. ఈ మందులే కాకుండా గ్రాఫైటీస్‌ ఇపికాక్‌, బ్రయోనియా, సల్ఫర్‌, కార్పొవెజ్‌, చైనా, వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే కడుపులో గడబిడల నుండి విముక్తి పొందవచ్చును.

v