కడుపుబ్బరానికి చికిత్స

Holding her stomack-1
Holding her stomack

కడుపుబ్బరానికి చికిత్స

మూత్రపిండాలు కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల వంట్లో నీరు ఉండిపోయి శరీరం ఉబ్బిపోతుంది. పొట్ట బాగా ఉబ్బి ఉండటం, మోకాళ్లు వాపు ఉండటం, జ్వరం రావడం లాంటి లక్షణాలుంటాయి. సాధారణ కారణాలతో కడుపుబ్బరం వచ్చిన వారికి ఈ మందులు వాడటం మంచిది.

చిట్కాలు:
జీలకర్రను నీటిలో వేసి, రసం తీసి ఆ రసాన్ని ప్రతిరోజూ మూడు పూటలా ఒక స్పూన్‌ చొప్పున తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.

మెంతుల్ని మెత్తగా పొడిచేసి పూటకు ఒక స్పూను చొప్పున నీటితో మింగాలి. ఇలా రోజుకు రెండుసార్లు తాగితే ఉబ్బరం తగ్గుతుంది.

జీడిమామిడి పళ్ళు మూడు తీసుకుని వాటి రసం ఒక కప్పులో పోసి ఒకే మోతాదుగా తాగాలి. రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

పిప్పళ్ళు తీసుకుని బాగా దంచి, చూర్ణం చేసి దానిలో అరస్పూన్‌ చూర్ణా నికి ఒక స్పూన్‌ తేనె కలిపి రోజూ మూడుపూటలా వాడుతుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.

జాజికాయ, జాపత్రి, శొంఠి, లవంగాలు, యాలకులు, చలవ మిరియాలు, సాంబ్రాణి మృదారు చిన్ని వీటన్నిటినీ సమభాగాలుగా తీసుకుని బాగా చూర్ణం చేసుకుని, జల్లించి అరస్పూన్‌ చొప్పున ప్రతిరోజూ రెండు పూటలా తీసుకుంటే కడుపుబ్బరం వ్యాధి తగ్గు తుంది.

మారేడుఆకుల రసం రెండు స్పూన్లు తీసుకుని దానిలో నాలుగు మిరియాలు చూర్ణం చేసి కలిపి తాగితే కడుపుబ్బరం తగ్గిపోతుంది.

తుంగముస్తలను శుభ్రం చేసి దాన్ని రసం తీసి, ఆ రసాన్ని ప్రతిరోజూ ఉదయం సమయంలో అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే ఉబ్బరం తగ్గు తుంది.
ఒక పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దాన్ని బాగా మరగకాచి చలార్చి వడగట్టి ఆ పాలను ఉదయం, సాయంత్రం తాగుతూ ఉంటే కడుపు బ్బరం రోగం తగ్గిపోతుంది.

శనగగింజంత ఇంగువను రోజూ మూడు పూటలా తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.

ఒక గ్లాసు పాలు తీసుకుని దానిలో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించి ఆ పాలను వడగట్టి తాగుతుంటే కడుపుబ్బరం తగ్గుతుంది. ప్రతి ఆరు గంటలకొకసారి నాలుగు వెల్లుల్లి రేకల్ని నమిలి మింగితే ఉబ్బురోగం తగ్గిపోతుంది. అలాగే పచ్చి కాకరకాయ రసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూన్‌ చొప్పున తీసుకోవాలి.