కడుపుబ్బరం తగ్గాలంటే…

PAIN
PAIN

కడుపుబ్బరం తగ్గాలంటే…

జీలకర్రను నీటిలోవేసి, రసం తీసి ఈ రసాన్ని ప్రతిరోజూ మూడు పూటలా ఒక స్పూన్‌ చొప్పున తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది. ్య మెంతుల్ని మెత్తగా పొడిచేసి పూటకు ఒక స్పూన్‌ చొప్పున నీటితో మింగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే ఉబ్బరం తగ్గుతుంది.

జీడిమామిడి పళ్లు మూడు తీసుకుని వాటి రసం ఒక కప్పులో పోసి ఒకే మోతాదుగా తాగాలి. రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ్య పిప్పళ్లు తీసుకుని బాగా దంచి, చూర్ణం చేసి దానిలో అరస్పూన్‌ చూర్ణానికి ఒక స్పూన్‌ తేనె కలిపి రోజూ మూడు పూటలా వాడుతుంటే కడుపుబ్బరం తగ్గుతుంది.

జాజికాయ, జాపత్రి, శొరఠి లవంగాలు, యాలకులు, చలవ మిరియాలు, సాంబ్రాణి మృదారు చిన్న వీటన్నిటినీ సమభాగాలుగా తీసుకుని బాగా చూర్ణం చేసుకుని జల్లించి అరస్పూన్‌ చొప్పున ప్రతిరోజూ రెండు పూటలా తీసుకుంటే ఉబ్బరం వ్యాధి తగ్గుతుంది.
మారేడు ఆకుల రసం రెండు స్పూన్లు తీసు కుని దానిలో నాలుగు మిరియాలు చూర్ణం చేసి కలిపి తాగితే కడుపుబ్బరం తగ్గిపోతుంది.