కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న టీమిండియా

Team indai

కింగ్‌స్టన్‌: భారత్‌-వెస్టిండీస్‌ 5వన్డేల సిరీస్‌లలో భాగంగా గురువారం జరిగిన ఐదో వన్డేలో భారత్‌ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. తొలుత టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభంలో 9వ ఓవర్‌ రెండో బంతికి ఇవిన్‌ లూయిస్‌ (9)పరుగులతో హర్థిక్‌ పాండ్యా బౌలింగ్‌లో షార్ట్‌కవర్‌లో కోహ్లీకి సులభ క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ఆతర్వాత కొద్ది సేపు దాటిగా ఆడిన వెస్టిండీస్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 15.5ఓవర్‌ వద్ద ఓపెనర్‌ కేల్‌ వోస్‌ 50బంతుల్లో 9ఫోర్లతో 46పరుగులతో అర్ధశతకానికి చేరువయ్యే దశలో ఔటయ్యాడు. ఆతర్వాత బంతికి రోస్టన్‌ ఛేజ్‌ డకౌటయ్యాడు. ఛేజ్‌ను ఉమేశ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 30.3ఓవర్‌ వద్ద జట్టు స్కోరు 115పరుగులున్నప్పుడు జెఎన్‌ మహ్మద్‌ (16)ను జాదవ్‌ ఔట్‌ చేశాడు. చివరి వార్తలు అందేసరికి వెస్టిండీస్‌ 33ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్లు షై హోప్‌ 41పరుగులతో, జాసన్‌ హోల్డర్‌ 3పరుగులతో క్రీజులో ఉన్నారు.