కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా మరో 8 కాలనీలు

వారం రోజులపాటు కఠిన ఆంక్షలు

containment zone
containment zone

హైదరాబాద్‌: వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు కరోనా భారిన పడడంతో, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వనస్థలిపురం పరిధిలోని ఎనమిది కాలనీలను కంటైన్‌ మెంట్‌ జోన్లుగా గుర్తిచారు. ఈ కంటైన్‌ మెంట్‌ జోన్‌లలో రేపటినుంచి వారం రోజులపాటు రాకపోకలు నిలిచిపోనున్నాయి. వనస్థలిపురంలోని హుడాసాయినగర్‌, కమలానగర్‌, సచివాలయ నగర్‌, ఎస్కేడి నగర్‌, రైతు బజార్‌ సమీపంలోని ఏ, బీ టైప్‌ కాలనీలు, ఫేజ్‌-1 కాలనీ లతో పాటు రైతుబజార్‌-సాహెబ్‌ నగర్‌ రహదారిని కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల పరిధిలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/