కంటి కింద చారలా?

eyes
eyes

కంటి కింద చారలా?

నీ రాత్రిపూట నిద్రలేకున్నా, అతిగా పనిచేసినా ఆ అలసట ముఖంలో ప్రతిబింబి స్తుంది. ఆ విషయం కళ్లకింద ఏర్పడే నల్లని చారలు స్పష్టంచేస్తాయి. నీ ఆ నల్లటి చారల గురించి దిగులుపడక సులభంగా పోగొట్టుకునే మార్గాలు ఆలోచించండి. నీ పడుకునే ముందు విటమిన్‌ సి, విటమిన్‌ ఇ కలిగిన క్రీమ్‌లను కంటి కింద రాయండి. పుదీనా ఆకులను బాగా చిదిమి కంటి కింద రాసుకుంటే చల్లగా ఉంటుంది. అలసట పోగొడుతుంది.

నీ నాలుగైదు బాదంపప్పులను నానబెట్టి మెత్తగా నూరి, దానికి తాజాపాలను కొంచెం కలిపి ఆ ముద్దను కళ్ళకింద రాసి 10-15 నిమిషాల తర్వాత తొలగించండి. నీ టమాటరసం, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని రోజుకు రెండు,మూడుసార్లు కళ్లకింద రాస్తే ఆ నల్లనిచారికలు ఇట్టే మాయమవ్ఞతాయి. నీ రెండు స్పూన్ల అనాస(పైనాపిల్‌)రసంపై చిటికెడు పసుపు చల్లి బాగా కలియబెట్టి అప్పుడు కళ్ళకింద రాసుకుంటే రెండుమూడు రోజుల్లో నల్లచారికలు పోయి, చర్మం కాంతులీనుతుంది.