ఓవరాల్ చాంపియన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో జరుగుతున్న ప్రధమ తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో 57 పాయింట్లతో ఓవరల్ చాంపియన్షిప్గా సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యా సంస్థ సాధించింది. అదే విధంగా బాలికల విభాగంలో కూడా 38 పాయింట్లతో ఇదే విద్యా సంస్థ ఓవరల్ చాంపియన్షిప్గా నిలిచింది. వ్యక్తిగత విభాగంలో 13 సంవత్సరాల బాలుర విభాగంలో 13 పాయింట్లతో ఇ.సురేశ్,టిఆర్ఇఐఎస్ విద్యా సంస్థకు చెందిన క్రీడా కారుడు సాధించగా, 19 సంవత్సరాల విభాగంలో డి.పవన్ టిడబ్ల్యుఆర్ఎస్ స్కూల్కు చెందిన 11 పాయింట్ల సాధించాడు. బాలికలు అండర్ -17 వ్యక్తిగత విభాగంలో 18 పాయింట్లతో ఎన్.జ్యోతి టిఎస్ఆర్ఐడబ్ల్యు విద్యా సంస్థ సాధించగా, 19 సంవత్సరాల వ్యక్తిగత విభాగంలో 13 పాయింట్లతో భవాని టిటిడబ్ల్యుఆర్ఎస్ విద్యా సంస్థలు చెందిన క్రీడా కారిని నిలబెట్టుకుంది. మిగిత క్రీడా పోటీల విజేతల వివరాలు కబడ్డీ అండర్ -17 బాలికలు ప్రధమ స్థానం టిటిడబ్యుఆర్ఎస్ విద్యా సంస్థ సాధించగా, ద్వితీయ స్థానం టిఎస్బ్ల్యుఅర్ఇఐ సాధించింది. ఖోఖో ప్రధమ బిసివెల్ఫేర్ విద్యా సంస్థలు సాధించగా, ద్వితీయ స్థానం టిటిడబ్ల్యుఆర్ఐఎస్ విద్యా సంస్థ సాధించింది. వాలీబాల్ ప్రధమస్థానం బిసివెల్ఫేర్ విద్యా సంస్థ సాధించగా, ద్వితీయ స్థానం టిఆర్ఇఐఎస్ విద్యా సంస్థ సాధించింది. హ్యాండ్ బాల్ ప్రధమ స్థానం టిటిడబ్ల్యుఆర్ఇఐ విద్యా సంస్థ, ద్వితీయ స్థానం టిఎస్బ్ల్యుఆర్ఇఐఎస్ విద్యా సంస్థ, టెన్నికాయిట్ : ఉషారాణి ప్రధమ స్థానం బిసివెల్ఫేర్ విద్యా సంస్థ, ఆర్.నవ్య, ద్వితీయ స్థానం, టిఎస్డబ్ల్యుఆర్ఇఐ సంస్థ, చెస్: లావణ్య ప్రధమ స్థానం టిడబ్ల్యుఆర్ఎస్ ద్వితీయ స్థానం సింధు టిటిడబ్ల్యుఆర్ఎస్, క్యారమ్స్: కె.వరలక్ష్మి ప్రధమ స్థానం టిటిడబ్ల్యుఅర్ఇఐ, ద్వితీయ స్థానం శ్రావ్య టిడబ్ల్యుఅర్ఐఎస్, 19 సంవత్సరాలు కబడ్డీ : ప్రధమస్థానం టిటిడబ్ల్యుఆర్ఇఐ, ద్వితీయ స్థానం టిఎస్డబ్ల్యుఆర్ఇఐ సంస్థ, ఖోఖో: ప్రధమ స్థానం టిటిడబ్ల్యుఆర్ఐ, ద్వితీయ స్థానం టిఆర్ఇఐ, వాలీబాల్ : ప్రధమ స్థానం టిటిడబ్ల్యుఆర్ఇఐఎస్, ద్వితీయ స్థానం టిఎస్డబ్ల్యుఆర్ఇఐఎస్, హ్యాండ్ బాల్ : ప్రధమ స్థానం టిఎస్డబ్ల్యుఆర్ఇఐ, ద్వితీయ స్థానం టిఆర్ఇఐఎస్ విజేతలుగా నిలిచారు. అథ్లెటిక్స్బాలికల విజేతలు : 100 మీటర్లు ప్రధమ స్థానం కె.చైతన్య, ద్వితీయ స్థానం ఎన్.జ్యోతి, తృతీయ స్థానం ఎన్.శ్రీలత, 200 మీటర్లు : కె.చైతన్య ప్రధమ స్థానం, బి.నిఖిల ద్వితీయ స్థానం, వి.తృతీయ స్థానం శ్రీలత, 400 మీటర్లు : ఎన్.జ్యోతి ప్రధమస్థానం, కె.కృష్ణవేణి ద్వితీయ స్థానం, డి.దివ్య ద్వితీయ స్థానం, 800 మీటర్లు : ప్రధమ స్థానం ఎం.జ్యోతి, ద్వితీయ సౌజన్య, దివ్య తృతీయ స్థానం, 1500 మీటర్లు : పి.అనితా ప్రధమ స్థానం, వై.శ్రీదేవి ద్వితీయ స్థానం, ఎం.లత తృతీయ స్థానం, 3 కిలోమీటర్ల వాక్ : బి.రచిత ప్రధమ స్థానం, ఎన్.లావణ్య ద్వితీయ స్థానం, శ్రీవల్లి తృతీయ స్థానం, శాట్ఫుట్ : నాగమణి ప్రధమ స్థానం, కె.తేజ ద్వితీయ స్థానం, శ్రీలత తృతీయ స్థానం, 4 ఇంటు 100 రిలే ప్రధమ స్థానం టిడబ్ల్యుఅర్ఎస్, ద్వితీయ స్థానం టిఆర్ఇఐ, తృతీయ స్థానం టిటిడబ్ల్యుఆర్ఎస్, 19 సంవత్సరాల బాలికలు 100 మీటర్లు : ఎన్.రోజు ప్రధమస్థానం, బి.స్వప్న ద్వితీయ స్థానం సాధించారు.