ఓలా నుంచి కొత్త ప్లాట్‌ఫామ్‌ ‘ఓలాప్లే

ola play
ola play

ఓలా నుంచి కొత్త ప్లాట్‌ఫామ్‌ ‘ఓలాప్లే

హైదరాబాద్‌: క్యాబ్‌రవాణా సంస్థ ఓలా క్యాబ్స్‌ కొత్తగా నగరంలో ఓలా కనెక్టెడ్‌ ప్లాట్‌ఫామ్‌ కింద ‘ఓలా ప్లేను ప్రారంభించింది. సంస్థ డైరెక్టర్‌ అంకిత్‌జైన్‌, సీనియర్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సుబ్రహ్మణి యన్‌లు ఈ ఓలాప్లేను ప్రారంబించారు. ఓలాకు చెందినక్లౌడ్‌ టెక్నాలజీతోపాటు శక్తివంతమైన ఓలాప్లే అత్యాధునిక కారు కంట్రోల్స్‌ తీసుకురావడంతో పాటు కస్టమర్లకు ప్రయాణ సమయంలో పూర్తిగా అనుసంధానించిన ఇంటరాక్టివ్‌ అనుభవాలు అంది స్తుందని అంకిత్‌జైన్‌ అన్నారు. దేశంలో ఇపుడు హైదరాబాద్‌తో సహా నాలుగు నగరాల్లో ఓలా ప్లే అమలుచేస్తున్నామని, మరిన్ని మెట్రోనగరాలకు విస్తరించగలమని ఆయన అన్నారు. హైదరాబాద్‌ తమకు ఎంతో కీలకమైన మార్కెట్‌ అన్నారు. ఇప్ప టికే ప్రారంభోత్సవంగా రెండువేల ప్రైమ్‌ ప్లే వాహ నాలు అందుబాటులో ఉంటాయని, రానున్న ఆరు నెలల్లో మరో పదివేల వాహనాలకు ఓలాప్లేపరిధి లోకి తెస్తామన్నారు. ఆటో వైఫై కనెక్ట్‌ ఫీచర్‌ ద్వారా ప్రయాణీకులకు ప్రైమ్‌అత్యున్నత పరిష్కాకరంగా నిలుస్తుందని, ఓలా ప్లే ద్వారా ట్యాక్సీ ట్యారిఫ్‌ ఇప్పటి వరకూ ఓలా ప్రైమ్‌ ధరల మాదిరిగానే ఉంటాయని అదనపురుసుం ఉండదని ఆయన అన్నారు. ఓలాప్లేతో జాతీయస్థాయి అగ్రశ్రేణి అంత ర్జాతీయ జాతీయ కంటెంట్‌, టెక్నాలజీ భాగస్వామ్య సంస్థలను తెరపైకి తెస్తున్నట్లు వివరించారు. ఓలాప్లే ప్లాట్‌ఫామ్‌పై యాపిల్‌ మ్యూజిక్‌, సోనీ, ఎల్‌ఐవి, ఎఐబి, యారే, ఆడియో కంపాస్‌ వంటి సంస్థల సేవలను ఓలాప్లేద్వారా కస్టమర్లకు చేరువచేస్తున్నట్లు ఆనంద్‌ సుబ్రహ్మ ణియన్‌ అన్నారు. హైదరాబాద్‌లో 2014లో ఓలాసేవలు ప్రారంభించామని,పదివేల మందికి పైగా డ్రైవర్‌ భాగస్వాములు తమతో ఉన్నార న్నారు. దేశంలోనే వందకుపైగా నగరాలకు విస్తరించిన ఓలా సరికొత్త ఫీచర్లతో కస్టమర్లకు మరింత చేరువఅయ్యే కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో తమ సంస్థ బుక్‌చేసుకున్నతర్వాత వాహనం కస్టమరుకు కేవలం మూడేమూడు నిమిషాల్లో చేరుతుందని అన్నారు.