ఓరుగల్లు..పోరుగల్లు: కెసిఆర్‌

TS KCR in Warangal Sabha
TS KCR in Warangal Sabha

ఓరుగల్లు..పోరుగల్లు: కెసిఆర్‌

వరంగల్‌: ఓరుగల్లు.. పోరుగల్లు అని సిఎం కెసిఆర్‌ అన్నారు.. వరంగల్‌ బహిరంగస భలో ఆయన మాట్లాడుతూ, ఓరుగల్లు పోరాటాలకు నిలయమన్నారు.. 6 నెలల్లో కరెంట్‌ కోతలు లేకుండా చేశామన్నారు.. 9,500 మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా విజయవంతంగా సరఫరా చేశామన్నారు..పరిశ్రమలు, గృహాలకు నిరంతర విద్యుత్‌అ ందిస్తున్నామని తెలిపారు.

తెరాస ఉండదన్నారు. అలా అన్నోళ్లే పోయారు

తెరాస ఉందని అన్నవాళ్లే పోయారని సిఎం కెసిఆర్‌ అన్నారు.. బహిరంగ సభలో ఆయనమాట్లాడâత, ఈ కీర్తి గౌరవం గులాబీ శ్రేణులదే అని అన్నారు. ఇంత పెద్ద సభ నిర్వహించటం దేశంలో ఏ పార్టీకి గుండెలు చాలవని అన్నారు.

ఏడాది చివరికల్లా అన్నిగ్రామాలకు కృష్ణా, గోదావరి నీళ్లు

ఈ ఏడాది చివరినాటికి అన్నిగ్రామాలకు కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొస్తామని సిఎం కెసిఆర్‌ తెలిపారు.. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

పవర్‌ హాలిడే లేకుండా చేశాం

తెలంగాణలో వ్యవసాయానిక పెద్దపీట వేశామని , ఇక్కడ బోర్లే ఆధారమని అన్నారు.. అందుకే పవర్‌ హాలిడే లేకుండా చేశామని సిఎం కెసిఆర్‌ అన్నారు.. వ్యవసాయం బాగుండాలంటే కరెంటు కోతలు ఉండకూడదని గుర్తించామన్నారు.. 6 నెలల్లోకరెంట్‌ కోతలు లేకుండా చేశామని తెలిపారు.

84 లక్షల గొర్రెలు పంపిణీ

ప్రతి గొల్ల, కురుమలకు 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తామని సిఎం తెలిపారు.. వరంగల్‌ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి గొల్ల కురుమ కుటుంబానికి 21 గొర్రెలు అందించబోతున్నామన్నారు.. ఇందులోఎలాంటి పైరవీలు ఉండవన్నారు.. సొసైటీలో సభ్యులైతే చాలు గొర్రెలు అందిస్తామన్నారు.