ఓపిక పట్టండి: కెటిఆర్‌

 

KTR
హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు అయిదేళ్లు టైం ఇచ్చారని , అప్పటి వరకు విపక్షాలు ఓపికపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. గత ప్రభుత్వాలు 50 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తామని అన్నారు. 60 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి నేతలు ఇపుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడలేని విధంతా పెన్షన్లు ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు పేదింట ఆడబిడ్డ పెళ్లికి రూ. 51వేలు అందిస్తున్నామన్నారు. అలాగే రూ.600 కోట్ల నల్లా, కరెంటు బిల్లులు మాఫీ చేయటం జరిగిందన్నారు.