ఓడిన జోష్న

josna
josna

ఓడిన జోష్న

లండన్‌: ప్రతిష్టాత్మక బ్రిటన్‌ స్క్వాష్‌ ఓపెన్‌ టోర్నీలో భారత పోరు ముగిసింది.తొలి రెండు రౌండ్‌లోనే సౌరభ్‌ ఓడిపోవడంతో రెండవ రౌండ్‌లోకి దూసుకెళ్లిన జోష్న చిన్పప్పపై భారత్‌ ఆశలు పెట్టుకుంది.రెండవ రౌండ్‌లో జోష్న కూడా పరాజయం చెందడంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి.మూడవ సీడ్‌గా బరిలోకి దిగిన జోష్న రెండవ రౌండ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్‌,ఈజిప్ట్‌ క్రీడాకారిణి రనీమ్‌తో తలపడింది.27 నిముషాల పాటు జరిగిన పోరులో ఆమె 8-11,7-11, 7-11తో ఓడింది.