ఓట్స్‌తో సౌందర్యం

సౌందర్యం

SKIN CARE
SKIN CARE

ఓట్స్‌తో సౌందర్యం మీ సొంతం

వేసవిలో రకరకాల చర్మసమస్యలు బాధిస్తుంటాయి. వాటి పరిష్కారానికి వివిధ సౌందర్యోత్పత్తులు ప్రయత్నించే బదులు ఇంట్లో దొరికే పదార్థాలతోనే చికిత్స చేసుకోవచ్చు. ్య ఓట్స్‌ మెత్తగా చేసి అందులో చెంచా తేనె కలిపి ముఖానికి పూత వేసుకుని పావ్ఞగంట య్యాక మర్దనా చేసి కడిగేస్తే మృతకణాలు తొలగి మేని మృదుత్వాన్ని పొందుతుంది.
చర్మం పొడిబారినట్లు కనిపిస్తుంటే అరటిపండు గుజ్జులో కొద్దిగా పెరుగు, నాలుగైదు చుక్కల గులాబీ నీరు కలిపి మెత్తగా చేసి ముఖానికి రాసుకొని అరగంటయ్యాక కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం తేమను పొంది కాంతివంతంగా కనిపిస్తుంది.

చర్మం కాంతివిహీనంగా మారినప్పుడు ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి అందులో గుడ్డులోని తెల్లసొన కలిపి పూతలా వేయాలి. తేమ ఆరాక నీళ్లతో తడిపి మర్దన చేసి కడిగేయాలి.

పంచదారను మెత్తగా చేసి అందులో చిటికెడు ఉప్పు, రెండు చెంచాల కమలారసం కలిపి ముఖానికి మర్దన చేసి, అరగం టయ్యాక కడిగే యాలి. రెండు, మూడు రోజులకో సారి ఈ నియమం పాటిస్తుంటే కళ్లకింద, ముఖం చుట్టూ పేరుకు పోయిన మృతక ణాలు క్రమం గా తొలగి చర్మం మెరుస్తుంది.