ఓట్ల కోసం రాజకీయ నేతల తిప్పలు

                           ఓట్ల కోసం రాజకీయ నేతల తిప్పలు

note for vote
note for vote

అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. మొక్క నిదే దేవ్ఞడైనా వరం ఇవ్వడు. కాని ఎన్నికలొస్తుంటే మా త్రం ప్రభుత్వం వరాలజల్లు కురిపి స్తుంది.తాయిలాల మూటలు అంది స్తానంటుంది. పాపం ప్రజల మీద ప్రేమ పొంగుకొస్తుంది. ఐదేళ్లుగా దాచుకున్న అనురాగం ఉప్పెనై పొంగదా మరి! వృద్ధులకు ఫించను అంటే యువతకు ఉపాధి కల్పించలేక విదేశాలకు పంపి బరువ్ఞ దించుకున్నందుకు ఆ మాత్రం చెల్లించాలి మరి అనుకున్నాం. దివ్యాంగులకు ఫించను ఇస్తామని ముందుకొస్తే, ఇన్నాళ్లకైనా తెలిసిందని సంబరపడ్డాం. 2019 ఎన్నికల సందర్భంగా ఏం వరమిచ్చి ఓటరు దేవ్ఞళ్లను ప్రసన్నం చేసుకోవాలని ఆలోచించి, నిరుద్యోగ భృతిని గేలం చివర ముల్లుకొక్కానికి తగిలించి ఓట్ల సముద్రంలోకి విసిరింది టక్కరి ప్రభుత్వం. మామూలుగా గేలానికి ఒకే చేప పడుతుంది. కాని రాజకీయ గేలానికి లక్షల వలల్లో పడినన్ని చేపల్లా ఓట్లు చిక్కుకుంటాయి. వేటగాడు ఒకే ఉపాయాన్ని ఎన్నిసార్లు ఉపయో గించినా ఓట్ల వేట విజయవంతమవడం చిదంబర రహస్యం.

ఆ రహస్యం వేటగాళ్లకే తెలుసు తప్ప చేపలకు ఎప్పటికీ తెలియడం లేదు. ఎరేసి ఓట్లు గుంజడం రాజకీయ నాయకులకు, ఓటర్లకు ఎన్నెన్నో జన్మల బంధం. దాన్ని తప్పుపట్టి ప్రయోజనం శూన్యం. ఎర నాణ్యతనైనా చర్చించాలని అప్పుడప్పుడు ఒకరిద్దరు మేధా వ్ఞలు తాపత్రాయపడుతారు. దానివల్ల వేటగానికి కోపం వస్తుంది గాని చేపలువీసమెత్తయినా ఎరమర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా, ఆ మేధావ్ఞలను పిచ్చివాళ్లను చేసి నవ్ఞ్వకుంటాయి. అదీ ఒకందుకు మంచిదే! వేటగాడి పన్నాగం చేపలకు తెలియలేదు కాబట్టి, అతని కోపానికి పిచ్చివాళ్లు బలికారు. చదువ్ఞకున్న యువకునికి నెలకు వేయి, రెండు వేల రూపాయ లో భృతి ఇవ్వడం ఎంత సిగ్గుచేటు! వేల సంఖ్య తక్కువని కాదు, యువత శక్తిని కించపరచడం సహించరానిది. యువతని సోమ రుల్లా తయారు చేసే ఆ ప్రక్రియ నేటి ప్రపంచ దేశాలు, భావి భారతావని నవ్ఞ్వకోడానికి హాస్యాన్ని సృష్టించాలన్న ప్రభుత్వ ప్రాజెక్టు కాబోలు! ఎంతైనా ప్రభుత్వం కళలను ప్రోత్సహించాలి కదా!

తప్పు,తప్పు ప్రోత్సహించడం కాదు, ఆ కళను తానే ప్రద ర్శిస్తోంది. కళ కోసం యువతను కించపరిచినా ఫర్వాలేదా? అని ప్రశ్నించేవారు నేరస్తులు. ప్రభుత్వానికే కాదు శ్రీశ్రీ చెప్పిన పుట్టుక తో వృద్ధులకు కూడా ప్రశ్నించే వారు కోపగ్రస్తులు. యువశక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలంటే కష్టపడాలని యువతకు, జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోపం రావడంలో తప్పు లేదు. అది కలియుగ ధర్మం! ‘నువ్వొకందుకు పోస్తున్నావ్ఞ, నేనొకందుకు తాగుతున్నానుఅని ఇరువ్ఞరూఒకర్నొకరు మోసం చేసుకుంటుంటే నవ్వడానికి శక్తిని కూడగట్టుకోవాలి తప్ప తప్పుపట్టే సాహసం చేయడం వివేకం కాదు.ప్రభుత్వం ఇచ్చే రెండువేలకు సరిపడే పని చేయించుకోమని ప్రభుత్వానికి కాని, చేయమని యువతకు గాని చెప్పడం సమంజసం కాదు. మాకు ఊరికే వద్దు ఏదైనా పని చెప్పండిఅని యువత అంటే కండ కరిగిపోతుంది. ఓగంటైనా పని చేసి భృతి తీసుకోండి అని ప్రభుత్వం అంటే భవిష్యత్‌లో జీతం పెంచి, రెగ్యులర్‌ చేయాలన్న భయం చుట్టుముడుతుంది.

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్ననిరుద్యోగికి భృతి ఇవ్వడం నేడు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం లాంటిదైతే హర్షనీయమే! కానీ సోమరుల ను తయారు చేసే మహాపరాధంగా మారితే, కొండ నాలుకకు మందేస్తే,ఉన్న నాలుక ఊడినట్లవ్ఞతుంది. ముప్ఫై ఐదేళ్ల వయసు తర్వాత కూడా ఇమ్మని ఉద్యమించడానికి దారివేసినట్లయితే, దేశా భివృద్ధి పీక కోసినట్లే! పనికి ఆహారంలా ఏదైనా పథకం చదువ్ఞ కున్నయువకులకు కూడా ఏర్పాటు చేస్తే అక్కడ జరిగినట్లు ఎంతో కొంత పని జరుగుతుంది. ఎంతోకొంత అభివృద్ధి సంభవిస్తుంది. కాని ప్రభుత్వానికి కావలసింది ఓట్లు కాని, అభివృద్ధి ఎవరికి కా వాలి?అధికార పార్టీ నాయకులు జీవితాలు గడిచిపోతాయి. మరొ క పదితరాలకు సరిపడా సంపాదించి పెడతారు.దేశం ఏమైతే వాళ్లకేంటి? నేడు గడిచిపోతే చాలు.

– తోట సుబ్రహ్మణ్యం