ఓటరు నమోదుకు నేడు ఆఖరిరోజు!

VOTER IDENTIFICATION
VOTER IDENTIFICATION

హైదరాబాద్‌: రాబోయే శాసనసభ ఎన్నికల్లో అవకాశమున్న పత్రి ఒక్కరూ ఓటు ఆయాధాన్ని ఉపయోగించుకొవాలి. అందుకు అర్హులైన వారు ఓటర్లుగా నమోదు చేసుకొవడం తప్పనిసరి. ఇప్పటికి ఓటు పొందనివారు, జనవరి 1,2018కి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందకు నేడు చివిరి రోజు. ఈరోజు సాయంత్రం 6గంటల వరకూ అవకాశం ఉంది. దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లాల ఎన్నికల యంత్రాంగాలు పోలింగ్‌ బూత్‌లలో సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫోటో, వయసు. ధ్రువీకరణ, చిరునామా తెలిపే గుర్తింపు కార్డులతో పౌరులు ఆయా కేంద్రాలను సంప్రదించి దరఖాస్తులు చేసుకొవాలి. వాటిని సంబంధిత జిల్లా అధికారులు పరీశీలించి అక్టోబరు 8నాటికి ఓటరు కార్డులను మంజూరు చేస్తారు.