ఓటమి భయంతో ముందస్తుకు సిద్ధం

Revanth reddy
Revanth reddy

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల కోసం సియం కేసిఆర్‌, మోదీ ముందు తలవంచుతున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ముందస్తు, సార్వత్రిక ఎన్నికలు వేర్వేరుగా వస్తే అభివృద్ది కుంటుపడుతుందన్నారు. ఎక్కడ పోటీ చేసిఆన కేసిఆర్‌, కేటిఆర్‌ గెలవలేరనే ముందస్తుకు వెళ్లున్నారని చెప్పారు. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ అని చెప్పిన బిజెపి తెలంగాణను ఎందుకు మినహాయిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.కోటి ఇచ్చారని విమర్శించారు. పొత్తులపై పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ స్పష్టత ఇస్తారని రేవంత్‌ వ్యాఖ్యానించారు.