ఓటమికి మేం అర్హులమే : ఆసీస్‌ సారథి

SMITH
SMITH

ఓటమికి మేం అర్హులమే : ఆసీస్‌ సారథి

నాగ్‌పూర్‌ : భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారీ తేడాతో (1-4) కోల్పోవడంపై ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరీస్‌లో ఈ పరాభవానికి మేం అర్హులమే. భారత జట్టు చాలా బాగా ఆడింది. ఆ జట్టులోని సభ్యులందరి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆటలో మమ్మల్ని చిత్తు చేశారు. 4-1 తేడాతో సిరీస్‌ ఓటమికి మేం అర్హులమే అని స్మిత్‌ అన్నాడు. తమ జట్టు సభ్యు ల ప్రదర్శన పట్ల స్మిత్‌ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. ఎంతో క్రికెట్‌ ఆడారని, అయినా, స్థిర త్వం కోసం కొట్టు మిట్లాటడటం శోచనీయమని అతడు అన్నాడు. దీన్ని ఓటమికి సాకుగా చెప్పబోనని…సానుకూల దృక్పథంతో ముందుకు సాగేందుకు ప్రయత్నించాలని అతడు తమ జట్టు సభ్యులకు సూచించాడు. రాబోయే సిరీస్‌లలోనైనా స్థిరమైన ఆటతీరుతో రాణిం చాల్సిన అవసరం ఉందని స్మిత్‌ అన్నాడు.

భారత్‌తో వన్డే సిరీస్‌ను 1-4తేడాతో కోల్పోవడం తీవ్ర నిరాశ పరిచిందని అతడు పేర్కొన్నాడు. ఆసీస్‌ జట్టు తాము ఆడిన గత 15 వన్డేల్లో 12 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. యాసెస్‌ సిరీస్‌ నేపథ్యంలో ఇది మంచి పరిణామం కాదని స్మిత్‌ అసహనం వ్యక్తం చేశాడు. నాగ్‌పూర్‌లో జరిగిన ఐదో వన్డే గురించి ప్రస్తావిస్తూ…ఒక దశలో 300 పరుగుల దిశగా దూసుకెళ్లే దిశలో…ఒక్కసారిగా వెనక్కితగ్గి 242 పరుగులే చేయడం నిరాశ కలిగించిందని స్మిత్‌ పేర్కొన్నాడు. తొలుత బ్యా టింగ్‌ చేసిన మా జట్టు 50-60 తక్కువ రాబట్టడం వల్లే ఓటమిపాలైంది. నాగపూర్‌ వికెట్‌పై 300లకు పైగా పరుగులు చేస్తే మాకు విజయావ కాశాలు ఉండేవి. మా టాప్‌ ఫోర్‌ బ్యాట్స్‌మెన్‌లో ఒకరు భారీ స్కోరు చేసి ఉండాల్సింది. వరుసగా వికెట్లు కోల్పోయాం. రోహిత్‌ శర్మ సెంచరీతో భారత్‌ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది అని స్మిత్‌ అన్నాడు. ఇకనుంచైనా తమను తాము మెరు గుపరుచుకొని స్థిరమైన ఆటతీరు కనబర్చాల్సి ఉందని స్మిత్‌ పేర్కొన్నాడు. స్థిరమైన ఆటతీరుకు అనుగుణమైన సమన్వయాన్ని సాధించాలని జట్టు సభ్యులకు సూచించాడు. టీ20 సిరీస్‌ ప్రారంభానికి ఇంకా 6 రోజుల సమయం ఉందని, బాగా ఆడి కనీసం ఈ ట్రోఫీనైనా ఇంటికి తీసుకెళతామని స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.