ఓజోన్‌ పొర పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి

AP Minister Devineni
AP Minister Devineni

ఓజోన్‌ పొర పరిరణలో భాగస్వామ్యం కావాలి

అమరావతి: ఓజోన్‌పొర పరిరక్షణకు ప్రతిఒక్కరూ సామాజిక దృక్పధంతో భాగస్వామ్యం కావాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.. ప్రపంచ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవానీపురంలో ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.,.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిఒక్కరూ ఒక్కోమొక్కను నాటానలని బాలబాలికలకుమంత్రి సూచించారు.. ఆ మొక్కలను సంరక్షించే బాధ్యతను వారే తీసుకోవాలన్నారు.. జియో ట్యాగింగ్‌ ద్వారా దినదిన అభివృద్ధి చెందే మొక్కల ఫొటోను వాట్సప్‌ చేయాలని అన్నారు..రాష్ట్ర శాస్త్రసాంకేతికి మండలి కార్యదర్శి బివిఎ కృష్ణమూర్తి మాట్లాడుతూ, సెప్టెంబర్‌ 16న ప్రపంచ ఓజోన్‌ పరిరక్షణ దినోత్సవం జరుపుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు..

కార్యక్రమంలో వివిధ కార్పొరేట్‌ కళాశాలలు నిమ్రా కళాశాల, నోవా ఇంజనీరింగ్‌ కళాశాల, అమృతసాయి కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులు, డిఎస్‌ఎంఎన్‌ స్కూల్‌, ఎన్‌ఎంఎ ఉర్దూ స్కూల్స్‌కు చెంది సుమారు 800 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. భవానీపురం సిఐ మురళీ, కార్పొరేటర్లు వై.రామయ్య, హబిబుల్లా, జిల్లా సమన్వయకర్త ఎం.హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.
===