ఒసాకాలో భూకంపం

                                        ఒసాకాలో భూకంపం

JAPAN
JAPAN

ముగ్గురి మృతి-100 మందికి గాయాలు
ఒసాకా: ఒసాకా నగరంలో సోమవారం ఉదయంజరిగిన భారీ భూకంపంలో ముగ్గురుచనిపోగా వందమందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. జపాన్‌లోని పారిశ్రామిక కేంద్రంగా ఉన్న ఈ నగరంలో సంభవించిన భూకంపం కారణంగా అనేక రైళ్లు నిలిచిపోయాయి. అలాగే పలు ఫ్యాక్టరీల్లో పనులు నిలిచిపోయాయి. భూకంపం ఉదయం ఏడు గంటల 58 నిమిషాలకు సంభవించింది. రిక్టర్‌స్కేలుపై 5.9 ప్రకంపనలతో వచ్చిందని అంచనా. తదనంతరం పెరిగి 6.1గా నమోదయింది. 13 కిలోమీటర్లమేర ఈ భూకంప ప్రభావం కనిపించింది. దీనివల్ల భారీగా భూమి కంపించింది. జపాన్‌ భూగర్భశాఖ అధికారుల కథనం ప్రకారం రిక్టర్‌స్కేలుపై ఏడుగా నమోదయింది. ఒసాకాలో ఇదే అత్యంత భారీ స్థాయి భూకంపం అని చెపుతున్నారు. గతంలో 1923లో ఒకసారి ఈ భూకంపం సంభవించింది. సముద్రజలాల్లో ఈ భూకంపం రావడంతో సునామి అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ఒసాకా నగరంలోని అన్ని రైళ్లు, సబ్‌వేలు నిలిచిపోయాయి. బుల్లెట్‌రైలు లింకులు ఒసాకా టోక్యోమధ్యనిలిపివేసారు. లక్షా 70వేలకుపైగా గృహాలకు విద్యుత్‌ సరఫరా అంతరాయం కలిగినా అధికారులు వెంటనే పునరుద్ధరించారు. కన్సా§్‌ు ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ ఇందుకుసంబంధించిన వివరాలిస్తూ విద్యుత్‌సరఫరా తీవ్ర అంతరాయం కలిగినా వెనువెంటనే పునరుద్ధరించామన్నారు. అయితే అణువిద్యుత్‌ ప్లాంట్లకు సంబంధించి ఎలాంటి ముప్పులేదని అధికారులుప్రకటించారు. ఈ భూకంప ధాటికి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తొమ్మిదేళ్ల బాలికసైతం ఉంది. ఒక పాఠశాల ప్రహరీగోడ కూలి ఆమెపై పడటంతో అక్కడికక్కడేమృతిచెందింది. మరో వందమందికి తీవ్ర గాయాలయ్యాయనిప్రభుత్వ అత్యవసర పునరావాస బృందాలు ఇందుకు సంబంధించి వెనువెంటనే చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ టివిసంస్థ ఎన్‌హెచ్‌కె భూగర్భ పైపులనుంచి పెద్ద ఎత్తున నీరురావడాన్ని ప్రసారంచేసింది. దీనివల్ల రైళ్లలోని ప్రయాణీకులు వెంటనే రైల్వేలైన్‌లనుంచి బైటికి పరుగులు తీసారు. పాఠశాల విద్యార్ధులు వెనువెంటనే బైటికి వచ్చేసారు. ఆటోమొబైల్‌, ఫ్యాక్టరీ హబ్‌గా నిలతిచిన ఒసాకాలో మౌలికవనరులను ఎక్కువ ధ్వంసంచేసింది. వాతావరణశాఖ మరికొన్ని ప్రకంపనలు రావచ్చని హెచ్చరించింది. వచ్చే రెండుమూడురోజుల్లో మరోరెండుభూకంపాలు వస్తాయని వెల్లడించింది. 2016లో కూడా వచ్చిన భూకంపం రిక్టర్‌స్కేలుపై ఏడుపాయింట్లుగా నమోదుచేసింది. అప్పుడు కూడా భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. దక్షిణ కుమామోటో ప్రాంతంలో భారీ ఎత్తున మరణాలు, క్షతగాత్రులైనవారిసంఖ్య అపారంగా కనిపించింది. జపాన్‌లోని అతిపెద్ద ఉత్పత్తిరంగ కేంద్రంలో ఈ భూకంపం రావడంతో అన్ని వర్గాలు భయాందోళనలకు గురయ్యాయి. పానసోనిక్‌కార్పొరేషన్‌, నిన్‌టెండో కంపెనీ,కేయెన్స్‌ కార్ప్‌, వంటి భారీ ప్లాంట్లు అన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. భూకంప ప్రభావంతో వీటి పనులను కార్యకలాపాలను నిలిపివేసారు. ఆటోమొబైల్‌రంగంలోని హోండా మోటార్‌ ంపెనీ, మిత్సుబిషి మోటార్స్‌ కార్ప్‌, టయోటా మోటార్‌కార్ప్‌ వంటివి గైహాట్సు వంటికంపెనీలు ఉత్పత్తిని నిలిపివేసాయి. జెఎక్స్‌టిజి ఎనర్జీ ఒసాకా రిఫైనరీని నిలిపివేసి ఎగుమతులనుసైతం తాత్కాలికంగా నిలిపివేసింది. పారిశ్రామిక యంత్రసామగ్రి తయారీదారు కుబోటా కార్ప్‌, బ్రూవర్‌ ఆసాహి గ్రూప్‌ హోల్డింగ్స్‌, కాస్మెటిక్స్‌ తయారీ షీసీడో కంపెనీ వంటివి ఫ్యాక్టరీల్లో పనులను నిలిపివేసారు. ఈప్రాంతంలోని కంపెనీలషేర్లు సైతం భారీగా దెబ్బతిన్నాయి. ఒసాకా గ్యాస్‌, సుమిటోమో ఒసాకా సిమెంట్‌ కంపెనీ, ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌ కిండెన్‌కార్ప్‌ వంటివి ఈ భూకంప తాకిడికి ఎక్కువ నష్టపోయాయి. అయితే ఎంతమొత్తం జరిగిందన వివరాలు అధ్యయనంచేయాల్సి ఉంది. వచ్చే ఏడాదిజూన్‌ 2019లో ఒసాకా నగరంలోనే జి-20 దేశాల సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. 1995లో కూడా 6.9 పాయింట్ల తీవ్రతతో కూడిన భూకంపం సంభవించి సుమారు ఆరువేల మందిని పొట్టనపెట్టుకుంది. పొరుగుననే ఉన్న కోబ్‌ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించి ఈ ప్రాంతానికి ఎగబాకింది. మొత్తం మీద జపాన్‌లో భూకంప ప్రకంపనాలకు పారిశ్రామికనగరం అయిన ఒసాకా వణికిపోయింది.