ఒవైసీ మ‌ద్ద‌తు పల‌క‌డం విడ్డూరంః భాజ‌పా నేత ల‌క్ష్మ‌ణ్

bjp ts president laxman
bjp ts president laxman

హైద‌రాబాద్ః ట్రిపుల్ త‌ల‌కుపై సుప్రీ ఇచ్చిన తీర్పుకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మద్దతునిచ్చిన సంగ‌తి తెలిసిందే.
దీనిపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ ఇస్లాం దేశాల్లో కూడా
అమలులో లేని ట్రిపుల్ తలాక్ కు ఎంపీ మ‌ద్ద‌తు పలకడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. ట్రిపుల్
తలాక్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పౌరహక్కులను కాపాడేలా ఉందని, అందరూ అంగీకరించార‌ని, ఈ తీర్పు
ముస్లిం మహిళల ఆత్మగౌరవం, స్వావలంబనకు సంబంధించిందని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని,
ఇప్పటికైనా పేద ముస్లిం మహిళలకు అన్ని పార్టీలు అండగా ఉండాలని, ఈ తీర్పును ప్రచారం చేయాలని
లక్ష్మణ్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.