ఒడిశాకు ఏపి తుఫాను సాయం

fani cyclone
fani cyclone at odisha

అమరావతి: ఫణి తుఫానుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒడిశాకు ఏపి ప్రభుత్వం చేయూతను అందించింది. ఒడిశాకు ఇప్పటికే ఏపి 12 లక్షల మంచినీటి ప్యాకెట్లు పంపింది. ఒడిశా సిఎస్‌తో ఏపి సిఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. అక్కడ లక్షకుపైగా విద్యుత్‌ స్థంభాలు విరిగిపడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో విద్యుత్‌ స్థంభాలను కూడా పంపించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒడిశాకు 2 లక్షల టార్పాలిన్లు, 200 యాంత్రిక రంపాలను పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/