ఒక ర‌కంగా మాకిది ప‌రీక్ష‌

SAIDHARAM TEJ
SAIDHARAM TEJ

మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ , స్టార్‌ డైరెక్టర్‌ వివి వినాయక్‌ కలిసి చేసిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌. ఈచిత్రం ఈనెల 9న (శుక్రవారం) నేడు విడుదల కానుంది.. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. .ఆ విశేషాలు..

సినిమా కాన్సెప్ట్‌ ఏమిటి?
జీవితంలో మనం ఎదగటానికి కొందరు చాలా సహాయం చేస్తారు. అలాంటి వాళ్లు కష్టాల్లో ఉనపుడు వాళ్ళకి మంన కూడ సహాయం చేయాలి.. ఆ సాయం చేయటానికి ఎంత దూరమైనా వెళ్లాలి.. అనేదే ఈసినిమా కాన్సెప్ట్‌..

ఇందులో మీ క్యారెక్టర్‌?
ఇందులో నేనొక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కన్పిస్తాను. ఒక అనుకూల వాతావరణలో ఉండే కుర్రాడు కొన్ని కారణాల వల్ల వాటిని వదిలి బయటికొచ్చి తన వాళ్ల కోసం ఎలా పోరాడతాడు.. కష్టాలను ఎలా తప్పించుకుంటాడు అనేదే నా పాత్ర చిత్రీకరణ..

వినాయక్‌తో చేయటం ఎలా ఉంది?
నిజంగా వినాయక్‌ గారితో సినిమా చేస్తాననని అస్సలు ఊహించలేదు.. వరుస ప్లాపుల్లో ఉన్న నన్ను ఖైదీ నెం 150 లాంటి భారీ హిట్‌ అందుకున్న తర్వాత పిలిచి మరీ సినిమా చేయడమనేది ఆయన గొప్పతనం.. ఆయనతో వర్క్‌ చేసినందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నాను..

ఈసినిమాను వినాయక్‌ చేయమన్నారని చేశారా? కథ నచ్చి చేశారా?
నేను ఈసినిమా చేయటానికి మొదటి కారణమైతే వినాయక్‌గారే.. అలాగే కథ నచ్చటం రెండో కారణం.. దర్శకుడు ఎవరైనా కథనేది ఉండాల్సిందే.

మీ వరుస పరాజయాలకు కారణం?
అంటే మేము తీసిన సినిమాలు జనాలకు సరిగా కనెక్ట్‌ కాకపోవటమే పైగా మేము అనుకున్నది అనుకున్నట్టు స్క్రీన్‌పై రాకపోవటంతో అవి ప్రేక్షకులకు నచ్చలేదు.

మీరు యాక్షన్‌ , కమర్షియల్‌ చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారెందుకు?

నాకు భిన్నమైన సబ్జెక్టులు చేయాలనే ఉంది.. కానీ నా దగ్గరకు వచ్చే వాళ్లు కమర్షియల్‌ సినిమాలతోనే వస్తున్నారు. అందుకే అవే చేస్తున్నాను.. అవకాశం వస్తే తప్పకుండా భిన్నమైన రీమిక్స్‌ చేయాల్సివస్తోంది.

చిరంజీవిగారి పాటలన్నిటినీ మీరే రీమిక్స్‌ చేస్తున్నట్టున్నారు?
అలా ఏం లేదండి.. నాతో సినిమాలు చేసే దర్శకుల డిమాండ్‌ వల్లే ..మావయ్య పాటల్ని రీమిక్స్‌ చేయాల్సి వస్తోంది.
మెగా హీరోలు పెరిగిపోతున్నారు.. మరి విడుదల సమయంలో క్లాషెస్‌ ఎక్కువవుతాయి కధా?
నిజమే ..ఇపుడు వరుణ్‌ సినిమాకు, నా సినిమాకు వచ్చినట్టే రిలీజ్‌ సమయంలో ఇబ్బందులు వస్తాయి.. వాటన్నిటినీ ఎలాగొలా అడ్జెస్ట్‌ చేసుకుని చేయాలి.. ఒక రకంగా మాకిది పరీక్ష లాంటిదనొచ్చు..

చివరగా.. మెగా అభిమానులకు ఏం చెప్తారు?
నా సినిమా 9న, వరుణ్‌సినిమా 10న రిలీజ్‌కానున్నాయి.. మెగా అభిమానులంతా రెండు సినిమాల్ని థియేటర్ల్‌లోనే చూడండి.. పైరసీని అస్సలు ఎంకరేజ్‌ చేయొద్దు.