ఒక్క సీన్‌కు 20కోట్లు ఖర్చు

mahesh
mahesh

హైదరాబాద్‌: మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
120కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో కేవలం ఒక్క సీన్‌ కోసమే 20కోట్ల వరకు ఖర్చు చేశారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌.
ఇంతకి సీన్‌ ఏమిటంటే విలన్‌ పాత్రలో నటిస్తున్న ఎస్‌.జె సూర్య ఓ రసాయన బాంబ్‌తో పాఠశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తాడట,
దీనిని అడ్డుకోవడానికి మహేశ్‌ పోరడతాడు, దాదాపు ఎనిమిది నిమిషాలు సాగే ఈ సీన్‌ ఎంతో ఉత్కంఠగా ఉంటుందట సినిమాలో
హైలైట్‌ సీన్‌లలో ఒకటిగా నిలిచే ఈ సీన్‌కు భారీ ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.