ఒక్క సిసి కెమెరా 100 మంది కానిస్టేబుళ్ల‌కు స‌మానంః నాయ‌ని

DIGITHAN 2018
DIGITHAN 2018

హైద‌రాబాద్ః సీసీ కెమెరాలతోనే సురక్షిత తెలంగాణ సాధ్యమని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక్క కెమెరా 100 మంది కానిస్టేబుళ్లతో సమానమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో గురువారం సెక్యూర్ డిజిథాన్, మేక్ తెలంగాణ సేఫ్ కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిథాన్ లోగోను ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణలో శాంతిభద్రతలను పూర్తిగా అదుపుజేయగలిగామన్నారు. నేరం జరిగిన 24 గంటల్లోనే నేరస్థులను అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. కేబీఆర్ పార్క్ వద్ద కాల్పులు, కిడ్నాప్, బేగంబజార్ ప్లాస్టిక్ వ్యాపారి కుమారుడి కిడ్నాప్‌లను సీసీ కెమెరాల సహకారంతోనే ఛేదించినట్లు పేర్కొన్నారు.