ఒక్కరోజులోనే 25పైసలు పెరిగిన రూపాయి

Rupees
Rupees

ఒక్కరోజులోనే 25పైసలు పెరిగిన రూపాయి

ముంబయి, మే 13: గడచిన నాలుగువారాల్లో ఒక్క రోజులోనే భారీగా రూపాయి బలపడింది. 25పైస లు పెరిగి డాలరుతో రూపాయి మారకం విలువలు 64.38గా నిలిచింది. కేవలం గురువారం ఒక్క రోజులోనే డాలర్‌తో రూపాయి పోటీపడింది. విదేశీ కరెన్సీ మార్కెట్‌ సెంటిమెంట్‌ కూడా దేశీయ ఈక్విటీపరంగా కొంత రూపాయికి మద్దతునిచ్చిం దనే చెప్పాలి. దేశీయ కరెన్సీ తొలుత 64.49 వద్ద ప్రారంభించి మంగళవారం 64.63వద్ద ముగిసింది. మధ్యాహ్నం తర్వాత 64.38కి చేరిం ది. 25పైసలు లాభం చేకూరినట్లు అంచనా. ఏప్రిల్‌ 13వ తేదీ తర్వాత గురువారం ఒక్కరోజు మాత్రమే పెరిగిందని అంచనా. ఒకదశలో ట్రేడింగ్‌ లో 64.57వద్ద కూడా నడిచింది. అదే మంగళ వారం జరిగిన ట్రేడింగ్‌లో 32పైసలు క్షీణించింది. వారంలోనే కనిష్టంగా 64.63రూపాయలుగా ఉంది.

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ఇన్‌ఫ్లోప్రకారం చూస్తే మార్కెట్‌ సెంటిమెంట్‌ పటిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు అంచనాలతో పోలిస్తే వర్షపాతం కూడా సాధారణస్థాయిలో ఉంటుందని భారతీయ వాతావరణశాఖ అంచనావేసింది. విదేశీ ఫండ్‌ సంస్థలు ఈక్విటీమార్కెట్లలో 893.36 కోట్ల రూపాయలవరకూ ఒక్కరోజులో పెట్టుబడులు కుమ్మరించారు. ఇక ఆర్‌బిఐ డాలరుతో రూపాయి మారకం విలువలు 64.4380లుగా నిర్ణయిస్తే యూరోధరలు రూ.70.1472లుగా నిర్ణయించింది. ఇక పౌండ్‌ స్టెర్లింగ్‌లపరంగాచూస్తే 83.52నుంచి 82.97కు క్షీణించింది. యూరోతో పోలిస్తే 69.97 గా ఉంది. దేశీయంగా జపాన్‌ యెన్‌తో పోలిస్తే వందయెన్‌ల మారకం విలువలు 56.45రూపాయ లుగా ఉన్నాయి. అంతకుముందు 56.79 యెన్‌ లుగా నిలిచాయి. ప్రపంచవ్యాప్త ట్రేడింగ్‌పరంగా అమెరికా డాలర్‌ కొంత గరిష్టంగానే ట్రేడింగ్‌ నిర్వ హించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ తన వడ్డీరేట్లను, మానిటరీ పాలసి నిర్ణయాలను వెల్లడించనున్నది. డాలర్‌సూచీపరంగాచూస్తే ఆరు ఇతరమేజర్‌ కరెన్సీ లతోపోలిస్తే 0.23శాతం పెరిగి 99.73 పాయిం ట్లు చేరుకుంది. ఇక అంతర్జాతీయ కమోడిటీపరం గా చూస్తే ముడిచమురు ధరలు తిరిగి రికవరీ అయ్యాయి. డబ్ల్యుటిఐ ముడిచమురు కాంట్రాక్టులు కోలుకుని వారంరోజుల గరిష్టంగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో47.78 డాలర్లుగా నడిచింది.