ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.19వేల కోట్ల నష్టం

 

MEDICINE11

ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లకు రూ.19వేల కోట్ల నష్టం

న్యూఢిల్లీ, మే 24: ఔషధ తయారీ కంపెనీల షేర్లు ఎక్కువగా అమ్మ కాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కీలక కంపెనీలైన సన్‌ఫార్మా, సిప్లా, అరబిందోఫార్మా, డా.రెడ్డీస్‌ లాబ్స్‌, లూపిన్‌ వంటివి 3 నుంచి 8శాతం దిగజారుతున్నాయి. 52 వారాల కనిష్టస్థాయిని చేరుకుంటున్నాయి. అమెరికాపరంగా ఈ కంపెనీలకు అతిపెద్ద మార్కెట్‌ కావడంతో ఆదేశంలో చట్టపరమైన ఆక్షలు ఎక్కువ కావ డమే ఇందుకు మూలం అని తేలింది. దేశీయంగా కూడా మందుల తయారీ రంగం ప్రభుత్వం ఇటీవల నిత్యాసవర మందుల ధరలు తగ్గించాలన్న ఒత్తిడి పెరగడంతో పలు సవాళ్లు ఎదుర్కొంటున్నా యి. దీనివల్ల షేర్లు పతనంకావడం వల్ల ఇన్వెస్టర్ల సంపద సుమా రు 19వేల కోట్ల వరకూ కరిగిపోయిందని తేలింది. ఒక్క మంగళ వారం నాడే భారీమొత్తం ఫార్మాకంపెనీల ఇన్వెస్టర్లకు నష్టం వచ్చిం ది.

మిడ్‌క్యాప్‌ ఫార్మా కంపెనీలు వొకార్డ్‌, టొరెంట్‌ఫార్మా, బయో కాన్‌, కేడిల్లా హెల్త్‌కేర్‌, స్ట్రైడ్స్‌ షాసన్‌, ఆల్కెమ్‌ ల్యాబ్స్‌, ఇప్కా ల్యాబ్స్‌, నాట్కో ఫార్మా, దివిస్‌ లాబ్స్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, పానేసియా బయోటెక్‌, వివిమెడ్‌ లాబ్స్‌, ఆస్ట్రాజెనెకా ఫార్మా వంటివి ప్రతికూలంగా కొనసాగాయి. రెండు నుంచి ఐదువాతం క్షీణించాయి. సన్‌ఫార్మా అమెరికా విభాగం తారోఫార్మా రాబడులు క్షీణించడంతో ఫార్మారంగ విశ్లేషకులు రానురాను కొంత అమ్మ కాలు ఉంటాయని అంచనావేసారు. అమెరికాలో ఫార్మా భవిష్యత్తుకు సవాళ్లు ఎదురవుతాయని అంచనాలువేసారు. తారో ఫార్మా డాలర్‌ రాబడులు 196 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది. గత ఏడాది 265 మిలియన్‌ డాలర్ల నుంచి భారీగా తగ్గింది. నికర ఆదాయం కూడా 115 మిలియన్‌ డాలర్లనుంచి 83 మిలియన్‌డాలర్లకు పడిపోయింది. తారో నిర్వహణ లాభం మార్జిన్లు కూడా 54 శాతం నుంచి 70శాతానికి పడిపోయాయి. సన్‌ఫార్మాకు 30శాతం నిర్వహణ మార్జిన్‌ను తారో సమకూరుస్తున్నది. ఎడెల్విసిస్‌ రేటింగ్స్‌ తారో రాబ డులు క్షీణించడానికి కేవలం ధరల ఒత్తిడి, పోటీ పెరగడమేనని విశ్లేషిం చింది. ఐడిబిఐ కేపిటల్‌మార్కెట్స్‌ ఫార్మా రంగ విశ్లేషకులు చతుర్య అగర్‌వాల్‌ మాట్లాడుతూ దేశాయ ఫార్మారంగానికి అమెరికా మార్కెట్‌ అవసరమైనంతమేర అవకాశం ఇవ్వడంలేదని విశ్లేషించారు. దీనివల్ల అక్కడి బిజినెస్‌ 5-6శాతం దిగజారింది. తారో గ్లెన్‌మార్క్స్‌ రాబడుల పరంగా ఎక్కువ కోతకు గురైనట్లు విశ్లేషఖుల అంచనా. చర్మవ్యాధు లకు సంబంధించిన ఉత్పత్తుల్లో మరింతగా తగ్గిందని అంచనా వేసారు. దేశీయ మార్కెట్లలో కూడా మరికొన్ని సాంకేతిక కారణాలు ఎదురుకావడం వల్ల ఫార్మారంగానికి మరింత తలనొప్పి ఎదురవు తోంది. ఐడిబిఐ కేపిటల్‌ మార్కెట్స్‌ ఎకెప్రభాకర్‌ మాట్లాడుతూ ఫార్మా కంపెనీల్లో రానురాను 8-10శాతం సర్దుబాట్లు ఉంటాయని అంచనా వేసారు. మరో త్రైమాసికంపాటు ఈ తలనొప్పులు దేశీయ ఫార్మా రంగానికి తప్పవని అంచనావేసారు. నిఫ్టీ ఫార్మా సూచి 3.4శాతం దిగజారింది. బెంచ్‌మార్క్‌ నిఫ్టీకంటే తగ్గింది. మొత్తం మీద దేశీయ ఫార్మారంగానికి ఎక్కువగా అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు కీలక రాబడులుగా ఉంటాయి. ఆయా దేశాల్లో ఎదురవుతున్న ఫార్మారంగ ఆంక్షలు, ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనలు వంటివి కొంత మార్కెట్లకు విఘాతం కలిగిస్తున్నాయని చెప్పకతప్పదు. భారత్‌ ఈ దిశగా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి దేశీయ ఔషధ రంగానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వాణిజ్యమంత్రిత్వ శాఖదే కీలక బాధ్యత అని ఫార్మారంగ నిపుణులు పేర్కొంటున్నారు.